Sunday, 29 March 2026 05:20:27 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Danam Nagender: బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదు.. వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లా: దానం నాగేందర్

Date : 28 January 2026 07:49 PM Views : 138

Studio18 News - TELANGANA / HYDERABAD : బీఆర్ఎస్ పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేసిన దానం నాగేందర్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా బీఆర్ఎస్ నేను పార్టీ మారినట్లు భావిస్తోందని వెల్లడి బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేయలేదన్న దానం నాగేందర్ నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, 2024 మార్చిలో వ్యక్తిగత హోదాలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లానని, దీంతో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నేను పార్టీ మారినట్లు బీఆర్ఎస్ భావిస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ప్రసాద్ కుమార్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన ఈ అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్‌ను కొట్టివేయాలని సభాపతిని కోరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచానని, ఆ పార్టీకి తాను రాజీనామా చేయలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఓసారి కాంగ్రెస్ సమావేశానికి వెళ్లినప్పటికీ వ్యక్తి గత హోదాలో వెళ్లానని పేర్కొన్నారు. ఆ పార్టీ అనర్హత పిటిషన్‌లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి తన అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని అన్నారు. అనర్హత పిటిషన్ తర్వాత పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని దానం నాగేందర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని దానం నాగేందర్‌కు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :