Studio18 News - TELANGANA / HYDERABAD : కిన్నెరసాని క్రీడా పాఠశాలలో తుది ఎంపికల సందడి నెలకొంది. అడ్మిషన్ల ప్రక్రియను ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ పరిశీలించారు. స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్ల కోసం 105 మంది విద్యార్థులు కసరత్తు చేశారు. మొత్తం 9 రకాల శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మార్చి నెలాఖరుకల్లా ఐదో తరగతి ప్రవేశాలు పూర్తి చేస్తామని స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: భవిష్యత్తు ఛాంపియన్లను తీర్చిదిద్దే లక్ష్యంతో పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో శనివారం బాలుర విద్యార్థుల తుది ఎంపిక ప్రక్రియ ఉత్సాహంగా నిర్వహించారు. ఐటీడీఏ భద్రాచలం ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, డిప్యూటీ డైరెక్టర్ అశోక్ ఆదేశాల మేరకు ఐదో తరగతి ప్రవేశాల కోసం ఈ ఎంపికలు చేపట్టారు. సహాయ గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి ఎస్. చంద్రమోహన్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి, క్రీడల్లో ప్రతిభ ఉన్న గిరిజన విద్యార్థులకు ఈ పాఠశాల మంచి వేదిక అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన నాలుగో తరగతి విద్యార్థులు తుది ఎంపికలకు హాజరయ్యారు. విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు 9 రకాల బ్యాటరీ పరీక్షలు నిర్వహించగా, 1:2 నిష్పత్తిలో మొత్తం 105 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఎంపికల అనంతరం మార్చి నెలాఖరుకల్లా ఐదో తరగతి అడ్మిషన్లను పూర్తి చేస్తామని ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బొల్లి గోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ క్రీడల అధికారులు వెంకటనారాయణ, నాగేశ్వరరావు, శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. చందు, పీడీ బాలసుబ్రమణ్యం, పీఈటీలు రాంబాబు, అంజయ్య, కృష్ణవేణి మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News