Wednesday, 11 March 2026 11:43:05 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు

Date : 11 March 2026 07:54 AM Views : 7

Studio18 News - TELANGANA / KHAMMAM : ఖమ్మం: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలిచింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఖమ్మంలోనే మకాం వేసి బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం పోరాటం కొనసాగించారు. సుమారు 15 రోజుల క్రితం ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారీ పోలీసు బలగాల మధ్య ఇళ్లను కూల్చివేయడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే దేవకి వాసుదేవరావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచారు. ఇళ్ల కూల్చివేత తీరును తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ఈటల రాజేందర్‌కు బాధితుల పరిస్థితిని వివరించి వారు ఖమ్మం వచ్చే విధంగా తీసుకువచ్చి బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఫిర్యాదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. అలాగే అంబేద్కర్ భవనంలో ఆశ్రయం పొందుతున్న భూదాన్ బాధితులకు భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు పలు మార్లు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వం వెలుగుమట్ల బాధితులకు అక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీజేపీ చేసిన నిరంతర పోరాట ఫలితంగానే భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు సాధ్యమయ్యాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు పేర్కొన్నారు. అదేవిధంగా మొత్తం 62 ఎకరాల భూదాన్ భూమిలో ఆక్రమణకు గురైన 30 ఎకరాల భూమిని కూడా వెలికితీసి ఇందుకు మా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :