Wednesday, 11 March 2026 11:43:04 AM
# సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన # అంగన్వాడీ టీచర్ ఒడ్డేపల్లి రాజేశ్వరికు బెస్ట్ టీచర్ అవార్డు # టేకులబస్తిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ స్లాబ్ పనులు ప్రారంభం # విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి # బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ కూనురాజుల సమ్మక్కకు పిహెచ్డీ డాక్టరేట్ # మందమర్రి పెద్ద మసీదులో రంజాన్ తోఫా కార్యక్రమం… మంత్రి వివేక్ వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొనం # నాగర్ గూడ శివారులో సీజ్ చేసిన ఇసుకకు బహిరంగ వేలం # బీజేపీ పోరాటంతో భూదాన్ బాధితులకు ఇళ్ల పట్టాలు # కోమట్లగూడెం గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి జాతర సందర్భంగా డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం # కుషాయిగూడలో ఘనంగా రేణుక ఎల్లమ్మ–జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం

విలేకరి చంద్రశేఖర్‌పై నమోదైన కేసు రద్దు చేయాలి: బీజేపీ నాయకుడు కొయ్యల ఏమాజి

Date : 11 March 2026 08:04 AM Views : 62

Studio18 News - TELANGANA / MANCHERIAL : కన్నెపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని వార్త రాసిన ఎన్‌కే 24 రిపోర్టర్ చంద్రశేఖర్‌పై పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి డిమాండ్ చేశారు. ఆయనపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే రద్దు చేయాలని కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిడి వల్లే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు దాడి చేసినప్పటికీ వారిపై పెటీ కేసు మాత్రమే పెట్టారని అన్నారు. బాధితునికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు అన్యాయంగా కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరిపై నమోదైన తప్పుడు కేసును రద్దు చేయకపోతే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు బాధితుడు చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు. విచారణ చేయకుండా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి కాంట్రాక్ట్ పనిని ఇతరులకు అప్పగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, అజ్మీరా శ్రీనివాస్, గోవర్ధన్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :