Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల జిల్లా కేంద్రంలో మృతి చెందిన శతాధిక వృద్ధురాలు అర్వపెల్లి అమృతా భాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కరీంనగర్ మెడికల్ కాలేజ్‌కు అందజేశారు. జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్‌కు చెందిన అర్వపెల్లి అమృతాభాయి (100) గత కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, మంచాల కృష్ణ, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ సమక్షంలో కరీంనగర్ మెడికల్ కాలేజీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మానవ శరీర దానం అనేది వైద్య విద్య మరియు శాస్త్రీయ పరిశోధన కోసం మనిషి సహజ మరణానంతరం మొత్తం మృత శరీరాన్ని వైద్య విద్యార్థులకోసం వైద్య కళాశాలకు దానం చేయడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. దేశంలోని అనాటమీ చట్టం ప్రకారం భవిష్యత్ వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి మరియు కొత్త శస్త్రచికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమని వెల్లడించారు. దానం చేయబడిన మృత శరీరాలను వైద్య విద్యార్థులు శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారని, మానవ శరీర నిర్మాణం మరియు అది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వారికి ఎంతో సహాయపడుతుందని తెలిపారు. అలాగే కొత్త వైద్య పరికరాలను అభివృద్ధి చేయడానికి మరియు వినూత్న శస్త్రచికిత్సా విధానాలను అభ్యసించడానికి వైద్య పరిశోధకులు కూడా వీటిని ఉపయోగిస్తారని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
Admin
Studio18 News