Saturday, 26 April 2025 06:08:33 AM
# హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం # భార్య రీల్స్ స‌ర‌దాకు.. ఊడిన భ‌ర్త కానిస్టేబుల్‌ ఉద్యోగం! # అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించింది: సునీతా విలియమ్స్ # ఊహకు అందనంత తక్కువ ధరకు.. అద్భుత ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్‌.. వెంటనే కొనండి.. # Chandrababu Naidu: ఆర్ధిక ఇబ్బందులున్నా ఉద్యోగుల బకాయిలు విడుదల చేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు # రాజీవ్‌ యువ వికాసం.. కొత్త రూల్స్‌ రిలీజ్‌.. డబ్బులు ఎవరికి ఇస్తారు? ఎలా ఇస్తారు? ఆల్‌ డీటెయిల్స్.. # Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు రిలీజ్.. ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పడ్డాయంటే.. # Chandrababu Naidu: ఆన్ లైన్ బెట్టింగ్ లపై చంద్రబాబు కీలక నిర్ణయం # Donald Trump: ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం # Jr NTR: అర్ధాంగికి బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ.. అందమైన ఫొటోల‌ను షేర్ చేసిన ఎన్‌టీఆర్ # Gabba Stadium: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్... కనుమరుగు కాబోతున్న ప్రఖ్యాత గబ్బా స్టేడియం # CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు.. ఛత్తీస్ గఢ్ లో కలకలం # Manchu Family Feud: అన్న సినిమాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తానన్న మనోజ్.. మంచు ఫ్యామిలీ గొడవ # యాహూ.. యూపీఐ, ఏటీఎం ద్వారా ఉద్యోగులు పీఎఫ్ డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు.. ఫుల్‌ డీటెయిల్స్‌ # Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు # GT vs PBKS : పంజాబ్ కింగ్స్ చేతిలో ఓట‌మి.. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ షాకింగ్ కామెంట్స్‌.. ‘టోర్న‌మెంట్‌కు మంచి ప్రారంభం..’ # Vemula Prashant Reddy: తెలంగాణ అసెంబ్లీలో గత ప్రభుత్వ హరితహారంపై ఆసక్తికర చర్చ # Home Town : ఆహా సిరీస్ ‘హోమ్ టౌన్’ ట్రైలర్ రిలీజ్.. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా.. # Trivikram – Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా మైథాలజీ పైనే.. నిర్మాత క్లారిటీ.. ఓ దేవుడి గురించే.. # Komatireddy Rajagopal Reddy: మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అటు స్టడీ టూర్లు, ఇటు ఆఫీస్ రినోవేషన్లు..! అధికారుల జల్సాలకు కేరాఫ్‌గా బల్దియా..!

Date : 04 October 2024 10:30 AM Views : 80

Studio18 News - TELANGANA / : Gossip Garage : హాయ్ సార్ ఎలా ఉన్నారు. భలే వారు సార్ బాగున్నాం. పైగా బల్దియాలో ఉన్నాం. మాకేం ఢోకా లేదు. హ్యాపీగా టూర్‌కు వెళ్తున్నాం.. ఆఫీస్ ఎలా కావాలంటే అలా రినోవేట్ చేసుకుంటున్నాం. పైగా మంచి ఇల్లు, పెద్ద కారు, ఐఫోన్. సోలో లైఫే సో బెటర్ అన్నట్లుగా.. బల్దియానే బెటర్ అంటున్నారు ఆ ఆఫీసర్లు. సంస్థలో పైసలు లేవు కానీ.. జల్సా చేయడంలో మాత్రం కాంప్రమైజ్ అవడం లేదు. స్టడీ టూర్లు, ఆఫీస్ రిన్నోవేషన్లు అంటూ పైసలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ బల్దియాలో ఏం జరుగుతోంది.? వచ్చిన ఆఫీసర్ వచ్చినట్లు ఇక్కడే ఎందుకు తిష్ట వేస్తున్నట్లు.? పైసలు లేకపోతే పండుగ చేసుకోవడం కష్టం. బల్దియా మాత్రం అందుకు భిన్నం. పైసలు లేక GHMC అవస్థ పడుతుంటే..రేపటి సంగతి తర్వాత..ఇప్పుడైతే ఎంజాయ్ చేయాల్సిందే అంటూ అధికారులు, కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక కష్టాలున్నాయ్‌..లోటును భర్తీ చేసుకునే మార్గమెట్లా అని ఆలోచించాల్సింది పోయి..అటు ఆఫీసర్లు ఇటు ప్రజాప్రతినిధులు అందరూ లగ్జరీకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజలను టార్చర్ పెట్టి ట్యాక్స్‌ వసూలు చేసి..తీసుకున్న అప్పుల కోసం ప్రతి రోజు కోటిన్నర రూపాయల వడ్డీ కడుతున్నా..కాందాన్ మే ఫరక్ నై ఆనా అంటున్నారు. అనుకున్నదే తడవుగా టూర్లు వేస్తున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో స్టడీ టూర్‌ అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. బల్దియా ఖాయా పియా చల్ దియా అనే నానుడి కంటిన్యూ అవుతుందా అంటే అవుననే చెప్పొచ్చు. అధికారులు ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే చాలు గబ్బిలం మాదిరిగా ఇక బల్దియాను వదలడం లేదు. జిల్లాలు, ఇతర డిపార్ట్ మెంట్ల నుంచి GHMCకి వచ్చిన అధికారులు..నేను పోనుపో..ఇక్కడే ఉంటా అంటూ పైరవీలతో కాలం వెల్లదీస్తున్నారు. బల్దియాకు వచ్చారంటే చాలు వెహికల్, కొత్త ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావాలని మంకు పట్టు పడుతున్నారట. ఇక లేటెస్ట్‌గా కార్పొరేటర్లు చేసిన స్టడీ టూర్ కోసం బల్దియా భారీగానే ఖర్చు చేసింది. ఒక్కో కార్పొరేటర్‌కు దాదాపు 69 వేల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా 115 మంది వరకు కార్పోరేటర్లు టూర్ కు వెళ్లారు. GHMCలోని కార్పొరేటర్లు మూడు విభాగాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో టూర్ కు వెళ్లారు. మేయర్ డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో ఈ టూర్ జరిగింది. MIM కార్పొరేటర్లు ప్రత్యేకంగా వెళ్లారు. మేయర్ బృందం యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో సిక్కీంలో పర్యటించారు. అక్కడ అమలు అవుతున్న ముఖ్యమైన ప్రాజెక్టులు, శానిటేషన్, రోడ్ల నిర్వహణ ఇతర అంశాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ను స్టడీ చేసి ఇక్కడ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. గతంలో అధికారులు ప్రజాప్రతినిధులు వారి పర్యటనల్లో అధ్యయనం చేసిన వాటిని కార్పోరేషన్ పరిధిలో అమలు చేయించే వారు. కానీ ఇప్పుడు జరిగిన టూర్లతో వచ్చిందేంటో..స్టడీ చేసిందేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. జస్ట్ టైంపాస్ టూర్ అంటూ అలా వెళ్లి వచ్చిన వాళ్లే కామెంట్లు చేస్తుండటాన్ని చూస్తే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కార్పొరేటర్ల టూర్ తో ఏం ఉపయోగమంటూ బల్దియా ఆఫీస్ లో గుసగుసలు పెట్టుకుంటున్నారు ఉద్యోగులు. కష్టకాలంలో ఉన్నప్పటికీ బల్దియాలో దుబారా పెరిగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. GHMC పెడుతున్న ఖర్చు కూడా చాలా వరకు వేస్ట్ ఖర్చే అంటున్నారు పబ్లిక్. టూర్ల కథ అట్లుంచితే ఇక కొంతమంది అధికారులు అయితే తమ కార్యాలయాల రిన్నోవేషన్ కు భారీగా ఖర్చులు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కిందిస్థాయి సిబ్బందికి, విజిటర్స్ కు మాత్రం కూర్చునేందుకు కుర్చీలు, టేబుల్స్ కూడా సరిగా లేని పరిస్థితి. ఉన్నతాధికారులకు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారట. గడిచిన మూడేళ్లలో GHMC హెడ్ ఆఫీస్ లో కార్యాలయాల రిన్నోవేషన్, మెయింటేనెన్స్ అంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇక జోనల్ కార్యాలయాలు, డిప్యూటీ కమిషనర్ ఆఫీసుల్లో ఎంత ఖర్చు అవుతుందో ఆ లెక్క వేరే. అధికారులు అయితే జబర్దస్తీగా బల్దియాలో బిస్తర్ వేస్తుతున్నారు. హైదరాబాద్ సిటీలో ..పైగా GHMCలో ఉద్యోగం.. అన్నింటికీ మించి మినిస్టర్ కు ఉన్నంత రాజభోగాలు. ఇంకేముందు బల్దియా అంటేనే ఆఫీసర్లకు జోర్దార్ అయిపోయింది. వచ్చామా అంటే వచ్చాం..పోయామా అంటే పోయాం..అన్ని అలవెన్సులు పొందామా అంటే పొందాం అన్నట్లుగా కొందరు అధికారులకు GHMC ఓ టూరిస్ట్ హౌజ్ అయిపోయింది. ఇక కొందరు అధికారుల అవినీతికైతే అంతే లేదన్న టాక్ ఎప్పటినుండో ఉంది. ఇటీవల జీహెచ్ ఎంసీ ఎంటమాలజీ విభాగంలో అవినీతి దుమారం రేగింది. దీనిపై కమిషనర్ అమ్రపాలి ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏకంగా సర్వీస్ నుంచే రిమూవ్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే విభాగంలో నిబంధనలకు విరుద్ధంగా తిష్టవేసిన అధికారులను సైతం రేపోమాపో శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సిన రిటైర్ మెంట్ కు దగ్గరగా ఉన్న ఓ ఉన్నతాధికారే కింగ్ పిన్ గా మారి ఎంటమాలజీ విభాగాన్ని భ్రష్టు పట్టించారని సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన చెప్పినట్లు చేసినందుకే తమ ఉద్యోగులు ఊడాయని ఔట్‌ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒక్కో విభాగంపై ఫోకస్ చేస్తూ కమిషనర్ అమ్రపాలి దూకుడు చూపుతుండటం.. ఇప్పుడు GHMCలో హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు ఏ విభాగానికి ముంచుకొస్తుందో… ఎప్పుడు ఏ అధికారిపై వేటు పడుతుందోననే చర్చ జోరుగా సాగుతోంది. మరి దుబారా విషయంలో అమ్రపాలి తీరు ఎలా ఉంటుందో చూడాలి మరి..

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :