Monday, 08 December 2025 04:29:47 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం.. ప్రాణ భయంతో జనం పరుగులు..

పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టడమే కారణం మంగళవారం రాత్రి ఘటన.. రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు బుధవారం బిల్డింగ్ కూ

Date : 20 November 2024 12:32 PM Views : 353

Studio18 News - TELANGANA / : హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం రాత్రి పక్కకు ఒరిగింది. బిల్డింగ్ కూలిపోతోందని భయాందోళనకు గురైన జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ లో ఉంటున్న వారు ఉన్నపళంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండకు చెందిన లక్ష్మణ్ రెండేళ్ల క్రితం సిద్ధిఖీ నగర్ లో తనకున్న 60 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. అందులో పలు కుటుంబాలు కిరాయికి ఉంటున్నాయి. మొత్తం 30 మంది ఆ బిల్డింగ్ లో ఉంటున్నారు. లక్ష్మణ్ ఇంటి పక్కనే ఇటీవల మరో బిల్డింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. సెల్లార్ కోసం భారీ గుంత తవ్వడంతో మంగళవారం రాత్రి లక్ష్మణ్ కు చెందిన నాలుగు అంతస్తుల బిల్డింగ్ కాస్తా పక్కకు ఒరిగింది. దీంతో అందులోని కిరాయిదారులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. మూడో అంతస్తులోని ఇక్బాల్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ హుస్సేన్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చుట్టుపక్కల బిల్డింగ్ లలో ఉంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముందుజాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఇళ్లల్లో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు. పక్కకు ఒరిగిన బిల్డింగ్ ను బుధవారం ఉదయం హైడ్రాలిక్ మిషిన్ సాయంతో కూల్చివేత చేపట్టారు. పొలం అమ్మి కట్టుకున్నాం.. ఊరిలో ఉన్న పొలం అమ్మి రెండేళ్ల క్రితమే భవనం కట్టుకున్నామని సదరు బిల్డింగ్ యజమాని స్వప్న చెప్పారు. తమ ఇంటి పక్కనే భారీ గుంత తవ్వడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బిల్డింగ్ కూలితే చుట్టుపక్కల వారికి ఇబ్బంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు కూల్చివేత చేపట్టడంపై తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే, బిల్డింగ్ పక్కకు ఒరగడానికి కారణం పక్కనే జరుగుతున్న నిర్మాణ పనులే కాబట్టి సదరు స్థలం యజమాని నుంచి తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పొలం అమ్మి, అప్పు చేసి కట్టుకున్న బిల్డింగ్ కోల్పోయామని, పరిహారం ఇవ్వకుంటే తన కుటుంబం రోడ్డున పడాల్సిందేనని స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభం

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :