Studio18 News - TELANGANA / RANGAREDDY : హయత్‌నగర్‌లోని వర్డ్ అండ్ డీడ్ హై స్కూల్‌లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల సీ.ఈ.ఓ ఎబెనేజర్ బెనెడిక్ట్ థామస్, సీ.ఎఫ్.ఓ పి. స్వరూప్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్య ద్వారా మహిళలు మరింత శక్తివంతంగా ఎదగాలని సూచించారు. పురుషుల విభాగం నుంచి మహిళా సిబ్బందికి సి.ఈ.ఓ ఎబెనేజర్ బెనెడిక్ట్ థామస్, సి.ఎఫ్.ఓ పి. స్వరూప్ కుమార్ మరియు ప్రిన్సిపాల్ ఎన్‌డిఎ ప్రియదర్శిని చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్‌డిఎ ప్రియదర్శిని కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Studio18 News