Studio18 News - TELANGANA / : హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రెడ్ హిల్స్ లోని నీలోఫర్ కేఫ్ వద్ద ఓ కారు వేగంగా వచ్చి జనాల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. అతనిని పట్టుకొని స్థానికులు చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేపీహెచ్‌బీలోని అపార్టుమెంట్‌లో అగ్నిప్రమాదం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న పదిహేను మందిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
Also Read : నాటు నాటు పాట ఎంత హిట్టో రఘురామ రచ్చబండ కూడా అంతే హిట్: సీఎం చంద్రబాబు
Admin
Studio18 News