Studio18 News - తెలంగాణ / : హైడ్రా తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లనే కూల్చేస్తున్నారని, బ్లాక్‌మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టిన 'రైతుదీక్ష' ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి పాలన కూడా కేసీఆర్ పాలనలాగే ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు గోసను తెలియజేసేందుకే బీజేపీ ఆధ్వర్యంలో ఈ దీక్షను చేపట్టామన్నారు. రైతుల ఆదాయాన్ని ప్రధాని మోదీ రెట్టింపు చేశారన్నారు. చిన్న చిన్న పంటలకు ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని నిన్న కేసీఆర్ నడిపారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నడుపుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కనీసం చిన్నకారు రైతుని కూడా ఆదుకోలేకపోయాయని అన్నారు. రైతుల హామీల సాధన కోసం తెలంగాణ బీజేపీ ప్రతినిధులు చేపట్టిన 24 గంటల దీక్ష కాంగ్రెస్ కుంభస్థలంపై కుంపటిగా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేదాకా బీజేపీ వదిలిపెట్టదని హెచ్చరించారు.
Admin
Studio18 News