Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కన్నాల గ్రామంలోని శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి క్షేత్రంలో భక్తిప్రపత్తులతో బెల్లంపల్లి 3వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బెడ్డల సౌజన్య – విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చిన వేలాది మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. “అన్నదాత సుఖీభవ” అంటూ భక్తులు హృదయపూర్వక ఆశీస్సులు అందజేశారు. ముక్కంటి శ్రీ బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దైవ దర్శనంతో పాటు భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.
Admin
Studio18 News