Studio18 News - తెలంగాణ / : KTR: మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు దీనికి సంబంధించిన పిటీషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కేటీఆర్ కోరారు. కేటీఆర్ వేసిన పిటీషన్ పై విచారణ కొనసాగనుంది. బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రమణ్ ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల కొండా సురేశ్ మాట్లాడుతూ.. కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన వారి పేరును ప్రస్తావిస్తూ కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల నాగార్జున ఫ్యామిలీతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ పిటీషన్ విషయంలో మొదటి సాక్షిగా సుప్రీయ స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసుకోగా.. ఇవాళ రెండో సాక్షి స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డును చేయనుంది.
Admin
Studio18 News