Saturday, 14 December 2024 03:29:36 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Vangalapudi Anitha: అలా చేస్తే క్రిమిన‌ల్ కేసులు పెడ‌తాం: హోంమంత్రి అనిత వార్నింగ్‌!

Date : 02 October 2024 04:42 PM Views : 25

Studio18 News - తెలంగాణ / : ఏలూరు కాల్ మ‌నీ ఘ‌ట‌న‌పై స్పందించిన హోంమంత్రి వంగ‌ల‌పుడి అనిత... అధిక వ‌డ్డీలు, అక్ర‌మ‌ వ‌సూళ్లు చేస్తే స‌హించేది లేద‌ని, అలాంటి వారిపై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను వ‌డ్దీల పేరుతో ఇబ్బంది పెట్ట‌రాద‌ని అన్నారు. కిస్తీల‌కు ముందే వ‌డ్డీ కోత‌, గ‌డువు దాటితే డబుల్ కిస్తీ పేరుతో చేసే కాల్ మ‌నీ వ్య‌వ‌హారంపై హోంమంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్ర‌త్యేక నిఘా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అక్ర‌మ వ‌సూళ్ల‌తో అమాయ‌కుల‌ను బ‌లిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామ‌న్నారు. వ‌డ్డీ వ్యాపారాల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నామ‌ని మంత్రి అనిత పేర్కొన్నారు. రోజువారీ వ‌డ్డీల పేరిట సామాన్య జ‌నాల‌ను వేధించేవారిని విడిచిపెట్టేది లేద‌ని హెచ్చరించారు. వైసీపీ నేత కాల్ మ‌నీ దందాకు తాము బ‌ల‌య్యామ‌ని ఇటీవ‌ల ఏలూరులో బాధితులు త‌మ గోడును వెళ్ల‌బోశారు. తాము తీసుకున్న అప్పుకు అధిక వ‌డ్డీలు క‌ట్టించుకున్నార‌ని వాపోయారు. స‌మ‌యానికి అప్పు చెల్లించ‌క‌పోతే అస‌భ్య‌ ప‌ద‌జాలంతో తిట్టేవార‌ని, భ‌య‌ప‌డి క‌ట్టినా ఇంకా బ‌కాయి ఉన్నారంటూ వేధించేవారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పు ఇచ్చిన స‌మ‌యంలో తీసుకున్న ప్రామిస‌రీ నోట్ల‌తో ఇప్పుడు త‌మ‌ను కోర్టుల చుట్టూ తిప్పుతున్నార‌ని వాపోయారు. కాగా, ఈ వ్య‌వ‌హారంపై మంత్రి అనిత ఇప్ప‌టికే ఏలూరు జిల్లా ఎస్‌పీతో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :