Studio18 News - TELANGANA / JAGTIAL : మహనీయుల స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకొని వారు చూపిన మార్గంలో ముందుకు సాగాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో 9వ వార్డులో మహాత్మా జ్యోతిరావుపులే, సావిత్రిబాపులే విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం స్థానిక అంగడి బజార్ లో చేనేత విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు బాపులే, సావిత్రిబాపులే వంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఆదర్శ దంపతులుగా వారు బడుగు బలహీవర్గాల అభ్యున్నతికి కృషి చేశారని ఆ మహనీయుల విగ్రహాలను మన ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం అని కొనియాడారు. సమాజంలో జరుగుతున్న కుల వివక్షత పై రాజీలేని పోరాటం చేశారని చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఆనాడు అణగారిన వర్గాల ప్రజలు చదువుకోవడం కోసం ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు.
Admin
Studio18 News