Monday, 16 March 2026 01:54:07 PM
# బెల్లంపల్లిలో రంజాన్ తోఫా పంపిణీ # గాలికుంటు నివారణ టీకాల ప్రచార రథాన్ని ప్రారంభించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ # చెరువుల్లో గుఱ్ఱపుడెక్క తొలగింపు పనులు ప్రారంభం… సుధీర్ రెడ్డి హామీ # రేకులపల్లిలో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ # సితాయిపేట్‌లో గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం # మధుయాష్కీ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి # పాశమైలారం మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # రామడుగు ప్రాజెక్ట్‌లో 2000–01 పదో తరగతి బ్యాచ్ 25వ వసంత వేడుకలు # బొల్లారం ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి # మాచన్పల్లిలో గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ జడ్పీటిసి పట్నం అవినాష్ రెడ్డి # అంబేద్కర్ కూడలిలో ప్రమాదకర గుంతలు… ఇబ్బందుల్లో రాజన్న భక్తులు # షాబాద్‌లో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు # అర్థనగ్న ప్రదర్శనతో రైతుల సంతకాల సేకరణ # మందమర్రిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు # రంజాన్ సందర్భంగా పేదలకు దుస్తుల పంపిణీ # పటాన్చెరు నియోజకవర్గంలో చిన్నారుల మధ్య మాద్రి పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు # దుబ్బాక గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం… పనులు పరిశీలించిన సర్పంచ్ సరోజినీ దేవి # పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విశ్వవర్ధన్ రెడ్డి శుభాకాంక్షలు # పదో తరగతి విద్యార్థులకు బీసీ సేన నాయకుడు బండ అజయ్ కుమార్ శుభాకాంక్షలు # కాంతామణి హత్య కేసు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ బి. ప్రకాష్

కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం

Date : 07 March 2026 07:44 PM Views : 38

Studio18 News - TELANGANA / KARIMNAGAR : డబ్బులు, బంగారంపై పెంచుకున్న వ్యామోహం ఓ కొడుకును హంతకుడిగా మార్చింది. కన్నతల్లి అని కూడా చూడకుండా అత్యంత పాశవికంగా గొంతు కోసి చంపిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ (52) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె చిన్న కుమారుడు ఈరెల్లి అనిల్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతురాలు గౌరమ్మ తన వద్ద ఉన్న సుమారు 10 లక్షల రూపాయల నగదు, 12 గ్రాముల బంగారు గొలుసు మరియు రెండు బంగారు ఉంగరాలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దాచుకుంది. మార్చి 3వ తేదీన ఆమె బ్యాంకు నుండి ఆ నగదును, నగలను విత్‌డ్రా చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఈ విషయం గమనించిన నిందితుడు అనిల్ కుమార్ ఆ డబ్బును తనకివ్వాలని తల్లిని వేధించాడు. ఆమె నిరాకరించడంతో పథకం ప్రకారం హత్యకు ఒడిగట్టాడు. మార్చి 5వ తేదీ మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అనిల్ కుమార్ తన తల్లిపై దాడి చేశాడు. నిద్రిస్తున్న తల్లి గొంతును కూరగాయలు కోసే కత్తితో బలంగా కోసి ప్రాణాలు తీశాడు. అనంతరం బీరువాలోని నగదు, నగలతో పరారయ్యాడు. గౌరమ్మ పెద్ద కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రామడుగు పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. విచారణలో అనిల్ కుమార్ చేసిన దారుణం బయటపడింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తి, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఒక చిన్న ఆశ కోసం కన్నతల్లిని చంపుకున్న కొడుకు ఉదంతం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :