Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని, దీంతో పేద ప్రజలు బీఆర్ఎస్ నేతలను కలుస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైడ్రా కమిషనర్‌ను మందలించి చట్టపరంగా ముందుకు వెళ్లాలని సూచించిన హైకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయని కేటీఆర్ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 300 రోజులు దాటిందని చెప్పారు. మూసి బాధితుల పాలిట సీఎం రేవంత్ రెడ్డి కాల యముడిగా మారారని, కాంగ్రెస్ హయాంలోనే తమకు అనుమతులు వచ్చాయని బాధితులు చెబుతున్నారని తెలిపారు. నిర్వాసితుల బాధలు ఏంటో తమకు తెలుసని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే అనుమతులు ఇచ్చిన అధికారులపై ముందు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2,400 కిలో మీటర్ల గంగా నది ప్రక్షాళనకు 40 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని, 55 కిలో మీటర్ల మూసికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా 50 వేల కోట్ల రూపాయలను కేటాయించడం కుంభకోణం కాదా? అని అన్నారు. బుద్ధ భవన్, జీహెచ్‌ఎంసీలను ముందు కూలగొట్టాలని, మూసి బాధితుల ఆక్రందనలు రాహుల్, ప్రియాంకలకు వినిపించవా అని నిలదీశారు.
Admin
Studio18 News