Studio18 News - TELANGANA / HYDERABAD : శ్రీరామ నవమి వేడుకల్లో ఘనంగా పాల్గొన్న బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి దంపతులు గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవం మరియు అన్నప్రసాద కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, వారి సతీమణి శ్రీమతి సృజనా రెడ్డి పాల్గొనగా, ఆలయ అర్చకులు మరియు దేవాలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని, భక్తులతో కలిసి కళ్యాణోత్సవాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని బద్దం సృజన ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో దేవాలయ కమిటీ సభ్యులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
Studio18 News