Studio18 News - TELANGANA / HYDERABAD : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సంబంధిత అధికారికి మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు గడిచినా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఫల్యాలను అంగీకరించి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
Admin
Studio18 News