Thursday, 26 March 2026 04:59:37 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

పెన్షనర్స్ హక్కుల సాధనకై సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం

Date : 25 March 2026 03:00 PM Views : 10

Studio18 News - TELANGANA / HYDERABAD : ఆర్మూర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్స్ సంఘ భవనం నుండి ర్యాలీగా వెళ్లి పెన్షనర్స్ హక్కుల సాధనకై సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ విశ్రాంతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, కోశాధికారి నవజీవన్, గౌరవ అధ్యక్షులు రాంరెడ్డి, జిల్లా కార్యదర్శి కరుణ సాగర్ రెడ్డి, రాఘవేందర్, స్టేట్ కౌన్సిలర్ పుష్పకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 2026 జనవరి 1కి ముందు మరియు తర్వాత పదవీ విరమణ పొందిన వారిని వేర్వేరుగా వర్గీకరించడం ద్వారా 7వ వేతన సవరణ సంఘం ప్రయోజనాలను పరిమితం చేసే ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయానికి నిరసనగా పెన్షనర్స్ అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి మార్చి 25ను బ్లాక్ డేగా పాటించామని చెప్పారు. ఒకే విధమైన సేవలు చేసిన ఉద్యోగుల మధ్య భేదభావం సృష్టించడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు పెరుగుతాయని, అలాంటి సమయంలో పింఛన్‌పైనే ఆధారపడి జీవించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వాలిడిటీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ యు. సాయన్న, మోహన్ రావు, నర్సిములు, నర్సయ్య, గంగాధర్, కోటేశ్వర్, సుధాకర్, ముత్తెన్న, ఎంసి ఓబన్న, జింధం నరహరి, బ్రహ్మయ్య, రమేష్, సుదర్శన్, రామ్మూర్తి, సత్తయ్య, మల్కన్న, సదానంద్, దివాకర శర్మ, లింబాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :