Studio18 News - అంతర్జాతీయం / : Tiktoker Dies : వీడియోలు, రీల్స్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. తిరిగిరాని లోకాలకు పోవాల్సిందే. తాజాగా జార్జియాలో జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. టిక్ టాక్ వీడియో చేస్తూ ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి పడి రష్యన్ టిక్ టాకర్ చనిపోయింది. అమె పేరు అరినా గ్లాజునోవా. వయసు 27ఏళ్లు. టిక్ టాకర్. వీడియోలు చేయడం ఆమెకు అలవాటు. ఇదే క్రమంలో టిబిలిసిలో వీడియో తీస్తుండగా సబ్ వే మెట్లపై నుంచి పడిపోవడంతో ఆమె మరణించింది. గ్లాజునోవా తన ఫ్రెండ్ తో కలిసి.. వీడియో రికార్డ్ చేస్తోంది. పాట పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇంతలో సబ్ వే వచ్చింది. అయితే, ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయిన గ్లాజునోవా సబ్ స్టేషన్ మెట్లపై నుంచి కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలతో చనిపోయింది. ఈ ఘటనలో ఆమె పుర్రె పగిలింది. శరీరంపై అనేక చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె బతికే ఛాన్స్ లేకపోయింది. ఫర్ ద లాస్ట్ టైమ్ అనే పాటకు ఆమె వీడియో చేస్తూ మృత్యువాత పడింది. కెమెరా దిక్కు చూస్తూ నడిచిన గ్లాజునోవా.. గోడ అంచుని చూడలేదు. ఈ క్రమంలో అండర్ గ్రౌండ్ మార్గంలో తల కిందులుగా పడిపోయింది. తీవ్ర గాయాలతో పడిపోయిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ లాభం లేకపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడం, మెడ విరిగిపోవడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
Admin
Studio18 News