Studio18 News - అంతర్జాతీయం / : ఈ కష్టకాలంలో నా తల్లిని చూడలేకపోయాననే బాధ ఉందని, నా తల్లిని కౌగిలించుకోలేకపోయాననే బాధ గుండెను పిండేస్తోందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కూతురు సైమా వాజెద్ ఆవేదన వ్యక్తం చేశారు. షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి దిగిపోవడంతో పాటు ఆ దేశాన్ని వీడారు. ఈ నేపథ్యంలో తన తల్లి పరిస్థితిపై సైమా ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. ఈ కష్టకాలంలో అమ్మకు తోడుగా ఉండలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. నేను ప్రేమించే నా దేశంలో జరిగిన ప్రాణనష్టం చూసి తన గుండె పగిలిందన్నారు. ఇలాంటి కష్టకాలంలో తన తల్లిని చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో రీజినల్ డైరెక్టర్‌గా విధి నిర్వహణకు కట్టుబడి ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Admin
Studio18 News