Studio18 News - అంతర్జాతీయం / : సాధారణంగా లారీ క్లీనర్లు, బస్ డ్రైవర్లు/ కండక్టర్లు కిటికిల్లోంచి బయటకు తొంగి చూస్తూ వెహికిల్ అద్దాలను క్లీన్ చేయడాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ విమానం ఫైలట్ కూడా విమానం అద్దాలను క్లీన్ చేశాడు. అది కూడా టేకాఫ్‌కు కొద్ది క్షణాల ముందు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 330-200 విమానం పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. కొద్ది సేపటిలో విమానం బయలు దేరాల్సి ఉండగా.. విమానం కిటికిలోంచి సగం వరకు బయటకు వచ్చిన ఫైలట్ విమానం ముందు అద్దాన్ని తుడిచాడు. అతడు ప్రమాదకరంగా బయటకు వచ్చి ఈ పని చేయడాన్ని చూసిన ఎయిర్‌పోర్టులోని వారు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విమానం అద్దాలను ఎవరైనా ఇలా శుభ్రం చేస్తారా.? అని ఒకరు, అతను పైలట్ లేదా బస్ కండక్టరా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సీన్స్ కేవలం పాకిస్తాన్‌లోనే కనిపిస్తాయని కొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. గతకొన్నాళ్లుగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక పతనం అంచుకు చేరుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధితో పాటు పలు మిత్ర దేశాల అండగా నిలవడంతో పతనం నుంచి బయటపడింది.
Admin
Studio18 News