Friday, 18 July 2025 06:22:58 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

25 లక్షల కోట్ల ఆస్తి.. ప్రపంచంలోనే రిచ్చెస్ట్​ ఫ్యామిలీ ఇది!

వేల కోట్ల విలువ చేసే ప్యాలెస్ లు, భవనాలు... సొంతంగా ఎనిమిది జెట్ విమానాలు.... అబుదాబికి చెందిన అల్ నహ్యన్ కుటుంబం ఆస్తులు ఎన్నో...

Date : 14 November 2024 12:22 PM Views : 188

Studio18 News - అంతర్జాతీయం / : వేల కోట్ల విలువ చేసే ప్యాలస్... వందల కొద్దీ భవనాలు... సొంతంగా చమురు బావులు... ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు... ఇలా ఒకటా రెండా లక్షల కోట్ల ఆస్తులు ఆ కుటుంబం సొంతం. ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం అది. అదే అబుదాబికి చెందిన అల్ నహ్యన్ రాచ కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆస్తులు 300 బిలియన్ డాలర్లకు పైనే. అంటే మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 25 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. అల్ నహ్యన్ కుటుంబం నివసించే రాజ భవనం ‘ఖసర్ అల్ వతన్’ ప్యాలెస్ విలువ 4 వేల కోట్లకుపైనే ఉంటుంది. అందులో ఉండే ఒక షాండ్లియర్ (సీలింగ్ నుంచి వేలాడే అలంకరణ)లో ఏకంగా 3.5 లక్షల రత్నాలు పొదిగి ఉండటం విశేషం. అల్ నహ్యన్ కుటుంబానికి లండన్, పారిస్ సహా ప్రపంచంలోని చాలా ప్రముఖ నగరాల్లో భారీ సంఖ్యలో భూములు, భవనాలు ఉన్నాయి. ఈ కుటుంబంలోని వారు ప్రయాణించేందుకు.. దేశంలో, విదేశాలకు రాకపోకలు సాగించేందుకు సొంతంగా ఎనిమిది ప్రైవేటు జెట్ విమానాలు కొనుక్కుని వాడుకుంటున్నారు. ఈ కుటుంబానికి సొంతంగా ఒక ఫుట్ బాల్ క్లబ్ కూడా ఉంది. దానితో ఫుట్ బాల్ లీగ్ లలో పోటీ పడుతుంటారు. అల్ నహ్యన్ రాచ కుటుంబం అధీనంలో ఉన్న చమురు నిల్వలు... మొత్తం ప్రపంచంలోని అన్ని చమురు నిల్వల్లో ఏకంగా ఆరు శాతం కావడం గమనార్హం. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కంపెనీల్లో ఈ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. ఈ కుటుంబానికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారాలను ‘టానౌన్ బిన్ జాయేద్ అల్ నహ్యన్’ చూసుకుంటారు. ఈ కుటుంబానికి చెందిన షేక్ హమద్ బిన్ హందాన్ కు కార్లు అంటే ఇష్టం. ఆయన వద్ద బుగాటీ వేరాన్, లాంబోర్గిని, ఫెరారీ, మెక్ లారెన్ కంపెనీలు సహా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 700 కార్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటి విలువ ఒక్కోటీ రూ.5 కోట్లపైనే ఉంటుంది.

Also Read : ఓ కుటుంబాన్ని బెదిరించి రూ. 70 వేలు తీసుకుంటుండగా యూట్యూబర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :