Sunday, 08 September 2024 06:08:23 AM
# Prakasam Barrage: ప్రకాశం బ్యారేజి గేట్ల మరమ్మతులు విజయవంతం # Kubera Movie: వినాయ‌క చ‌వితి స్పెష‌ల్... 'కుబేర' నుంచి కొత్త‌ పోస్ట‌ర్ # Arvind Kejriwal: లిక్కర్ పాలసీ ద్వారా పార్టీకి ప్రయోజనం చేకూరాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు: సీబీఐ # Chiranjeevi: చిరంజీవి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు # Nagarjuna Sagar: నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం... 24 గేట్లు ఎత్తిన అధికారులు # Yasir Arafat: పాక్ క్రికెట్ బోర్డు ఓ స‌ర్క‌స్‌.. అందులో అంద‌రూ జోక‌ర్లే: యాసిర్ అరాఫ‌త్‌ # CM Revanth Reddy: కీలక వ్యక్తికి విద్యా కమిషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన రేవంత్ సర్కార్ # irrigation officials: ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై పోలీసులకు ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు # Pervez Musharraf: భార‌త్‌లో పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.38 కోట్ల‌కు వేలం! # Brij Bhushan: నాటి కుట్ర నేడు బట్టబయలైంది.. వినేశ్ ఫొగాట్ రాజకీయ ప్రవేశంపై బ్రిజ్ భూషణ్ విమర్శ # Dharshan: అశ్లీల సందేశాలతో మొదలై... హత్యకు గురయ్యే దాకా...! రేణుకా స్వామి హత్యలో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు # Babar Azam: బాబర్ ఆజామ్‌కు షాక్‌.. పాకిస్థాన్‌ కొత్త కెప్టెన్‌​ ఎవరంటే? # T20 Blast 2024: బౌలర్‌తో సంబంధం లేని.. క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన నోబాల్.. # Budameru: హమ్మయ్య.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు # TGSRTC: పాప్యులారిటీ కోసం ఇలాంటి సోయిలేని ప‌నులు చేయ‌కండి.. సజ్జనార్ ఫైర్‌! # Military School: మిలటరీ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల # Chandrababu: సీఎం చంద్ర‌బాబు క‌లిసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ # Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి సందేహాలు # Chandrababu: విజయవాడ కలెక్టరేట్ లో వినాయక పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు # CV Anand: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

Kamala Harris: కమలా హ్యారీస్‌కు సంపూర్ణ మద్దతు: బరాక్ ఒబామా

Date : 26 July 2024 04:16 PM Views : 42

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష నామినీగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ నిలబడడం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఇష్టం లేదంటూ కొన్ని రోజులుగా వెలువడుతున్న ఊహాగానాలకు తెరపడింది. కమలా హ్యారీస్‌కు ఒబామా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం కీలక పరిణామం జరిగింది. ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా ఇద్దరూ కలిసి కమలా హ్యారీస్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. సంక్లిష్టమైన ఈ సమయంలో ఉండాల్సిన దీర్ఘ దృష్టి, సామర్థ్యం, చక్కటి స్వభావం ఉన్నాయని ఒబామా కొనియాడారు. చరిత్ర సృష్టించబోతున్నామని ఆమెను ఉత్సాహపరిచారు. ఈ మేరకు ప్రైవేట్ ఫోన్ కాల్‌కు సంబంధించిన సంభాషణ వీడియోను అధికారికంగా షేర్ చేశారు. ‘‘ నేను, మిచెల్లీ మీకు ఫోన్ చేసింది కేవలం మీకు మద్దతు తెలపడానికే కాదు. మిమ్మల్ ఓవల్ ఆఫీస్‌కు తీసుకెళ్లేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. ఈ విషయం మీకు తెలియజేయడానికి గర్వపడుతున్నాను’’ అని ఒబామా పేర్కొన్నారు. ‘‘ మీ పట్ల ఆప్యాయత లేకుంటే ఈ ఫోన్ కాల్ చేసేవాళ్లం కాదు. నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం‘‘ అని మిచెల్ ఒబామా అన్నారు. ‘‘మిచెల్, బరాక్ మీకు నాకు ఫోన్ చేయడం నాకు చాలా గొప్పం విషయం’’ అని కమలా హ్యారీస్ అన్నారు. ‘‘మీ ఇద్దరితో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. నా భర్త డగ్, నేను మీరు మాట్లాడిన మాటలను, ఇన్నేళ్లు మాతో కొనసాగించిన స్నేహం మాటల్లో చెప్పడం కంటే చాలా ఎక్కువ. మీ ఇద్దరికీ ధన్యవాదాలు’’ అని కమలా హ్యారీస్ పేర్కొన్నారు. ఫోన్ కాల్ అనంతరం ఎక్స్ వేదికగా కూడా ఈ మేరకు బరాక్ ఒబామా ప్రకటన చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :