Studio18 News - అంతర్జాతీయం / : World Most Powerful Passports 2024: ప్రపంచ దేశాల్లో మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఏదో తెలుసా? హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా 2024 ర్యాంకులను ప్రకటించింది. సింగపూర్ పాస్‌పోర్ట్ మోస్ట్ పవర్‌ఫుల్ అని హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ తెలిపింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ పాస్‌పోర్టులకు సంయుక్తంగా సెకండ్ ర్యాంక్ దక్కింది. వీటితో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్‌పోర్ట్స్ 191 గమ్యస్థానాలకు వీసా-రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి. బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్.. 4వ ర్యాంకులో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌తో 190 దేశాలకు వీసా ఫ్రీ జర్నీ చేయొచ్చు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఇండియా పాస్‌పోర్ట్ 82వ స్థానంలో ఉంది. మన పాస్‌పోర్ట్‌తో ఇండోనేసియా, థాయలాండ్, మలేసియా సహా 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. పాకిస్థాన్ పాస్‌పోర్ట్ 100వ ర్యాంకులో నిలిచింది. దీంతో 33 దేశాలకు వీసా రహిత ప్రయాణం సాగించొచ్చు. చివరి స్థానం దక్కించుకున్న అఫ్గానిస్తాన్ పాస్‌పోర్ట్‌తో కేవలం 26 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లగలరు.
Admin
Studio18 News