Monday, 15 December 2025 02:20:08 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

US politics: డెమొక్రాట్లు, రిపబ్లికన్లలో భారత్‌కు అండగా నిలిచేదెవరు?

Date : 24 July 2024 10:34 AM Views : 320

Studio18 News - అంతర్జాతీయం / : యూఎస్‌ ప్రెసిడెంట్‌ పోల్స్‌ను కీన్‌గా అబ్జర్‌ చేస్తోంది భారత్‌. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికాకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోన్న తరుణంలో ఇప్పుడు ఆ దేశంలో జరుగుతోన్న ఎన్నికల సమరం భారత్‌లో ఉత్కంఠ రేపుతోంది. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగుతోన్న యూఎస్ అధ్యక్ష రేసు భారత్‌నే కాదు..ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికాలో ఇండియన్స్ ఎక్కువగానే ఉంటారు. అక్కడ సెటిల్‌ అయినవారు చాలా మందే ఉన్నారు. ఉపాధి, ఉద్యోగ రంగాల్లోనే కాదు.. అగ్రరాజ్యంలో ఇండియన్ అమెరికన్స్ ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనే మనోళ్లు రేసులో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతోన్న కమలా హారిస్‌ తమిళనాడు మూలాలన్న వ్యక్తి. జోబైడెన్‌ తప్పుకోవడంతో ఆమే అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం ఉంది. రిపబ్లికన్ పార్టీ తరఫున తెలుగమ్మాయి ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేయడం ఖాయమైంది. అక్కడ ఏ పార్టీ గెలిచిన మనోళ్ల ప్రాతినిధ్యం అయితే ఉంటుంది. కానీ అమెరికాలో ఏ పార్టీ గెలిస్తే మనకు ప్రయోజనం అన్నదే చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు మూలాలున్న వ్యక్తి జోబైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్‌ అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కమలా హారిస్‌ తల్లి తమిళనాడు మూలాలున్న వ్యక్తి. ఆమె తండ్రి మాత్రం జమైకాకు చెందినవాడు. అయితే తన భారతీయ మూలాలపై చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు కమలా హారిస్‌. డెమొక్రాటిక్‌ పార్టీ విధానాలో లేక ఆమె వ్యక్తిగత వైఖరో తెలియదు కానీ.. భారత్‌ పట్ల పూర్తిస్థాయిలో సానుకూల వైఖరి చూపించడం లేదు కమలా హారిస్. యూఎస్‌ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైమ్‌లోనూ ఇండియాకు రాలేదు కమలా హారిస్. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి వైట్‌హౌస్‌లో ఆతిథ్యం ఇచ్చారామె. మోదీ నాయకత్వాన్ని ప్రశంసించినప్పటికీ.. కశ్మీర్ విషయంలో కమలా హారిస్‌ చేసిన కామెంట్స్‌ మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్నాయి. కశ్మీర్‌పై మోదీ విధానాలను విమర్శించిన హారిస్.. 370 ఆర్టికల్‌ రద్దును తప్పుబట్టారు. కశ్మీరీలు ఒంటరిగా లేరని కూడా చెప్పుకొచ్చారు. ఇండియన్ మూలాలు ఉన్న ఆమె కశ్మీర్ విషయంలో పాక్‌కు అనుకూలంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు నాయకులు తమ తమ దేశాలలో రాజకీయ ర్యాలీలలో ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో ఇండియన్ అమెరికన్లతో హౌడీ మోడీ ఈవెంట్‌ను నిర్వహించారు ట్రంప్. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అపూర్వస్వాగతం లభించింది. లక్షలాదిమంది ఇండియన్స్‌ను ఉద్దేశించిన ప్రసంగించారు మోదీ. 2020లో నమస్తే ట్రంప్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 2020లో నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం కోసం పర్యటించారు ట్రంప్. అహ్మదాబాద్‌లో దాదాపు లక్ష మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్‌ గుజరాత్‌ పర్యటన తర్వాత ఈ ఇద్దరి నేతల మధ్య బంధాలు బలపడినట్లు ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. అప్పటి నుంచి మోదీపై ట్రంప్‌కు సానుకూల వైఖరి ఏర్పడిందని అంటున్నారు. అందుకే భారత్‌ స్వతంత్ర దౌత్య విధానంపై ట్రంప్ అసంతృప్తిగా లేరన్న చర్చ ఉంది. ట్రంప్‌తో మోదీ దోస్తీ ఇలా ఉంటే.. అమెరికా గడ్డపై ఓ సిక్కు కార్యకర్త హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ కౌగిలించుకోవడం అమెరికాకు చిరాకు తెప్పించాయి. ఈ రెండు అంశాలు అమెరికా, భారత్‌ మధ్య కాస్త గ్యాప్ క్రియేట్ చేశాయన్న టాక్ ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో యూఎస్‌లో ఎవరు గెలిచినా..అమెరికా-భారత్ సంబంధాలు పటిష్టం అయ్యే నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :