Studio18 News - అంతర్జాతీయం / : Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో ట్విస్ట్ చోసుకుంది. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు బైడెన్. కమలా హారిస్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బైడెన్ పోటీకి సంబంధించి సొంత పార్టీ నేతల నుంచే తీవ్రంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్.. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల(డెమోక్రాట్స్) నుంచే వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Admin
Studio18 News