Thursday, 12 March 2026 04:12:36 AM
# మధిర బార్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగింపు # కళ్యాణ లక్ష్మి–షాది ముబారక్ చెక్కుల పంపిణీ # మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి # ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుక # ప్రజా సమస్యలు విన్న ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి # అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశుభ్రత కార్యక్రమం # ప్రభాత్ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు కు కాలనీవాసుల వ్యతిరేకత # ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 19వ వార్డు కౌన్సిలర్ గొంగుల సంధ్య నవీన్ రెడ్డి # సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ # సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు # రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన # అశోక్ నగర్ వినాయక ఆలయంలో చోరీ # కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆదర్శ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి # శ్రీరామనవమి వేడుకల కోసం రూ.1.51 లక్షల విరాళం # సాయిరాం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన # ఇంటి పన్నులు, వ్యాపార లైసెన్స్ రుసుములు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి # లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని అడువాల జ్యోతి లక్ష్మణ్ # ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్‌కు వ్యతిరేకంగా జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగుల నిరసన # రూప్ సింగ్ తాండ ప్రాథమిక పాఠశాలకు టీవీ బహుమతి # మరియా తాండలో ఉపాధి హామీ పనుల పరిశీలన

China: పాంగాంగ్ టిసో సరస్సు ఒడ్డున బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసిన చైనా.. ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తున్న సైనికులు

Date : 31 July 2024 11:30 AM Views : 307

Studio18 News - అంతర్జాతీయం / : ఇటీవలి కాలంలో భారత సరిహద్దు ప్రాంతాల్లో సైన్యాన్ని విస్తరిస్తూ కవ్విస్తున్న చైనా, తాజాగా పాంగాంగ్ టిసో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాన్ని కలుపుతూ చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసింది. ఇప్పుడీ ఈ వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సైన్యాన్ని అతి తక్కువ సమయంలో సరిహద్దుకు తరలించే లక్ష్యంతో దీనిని నిర్మించింది. లడఖ్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో 1958 నుంచి చైనా అధీనంలో ఉన్న భూభాగంలో ఈ వంతెన ఉంది. ‘ఎన్డీటీవీ’ ప్రచురించిన ఈ శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర భాగంలో నాలుగు నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. పాంగాంగ్ ఉత్తర తీరంలో ఖుర్నాక్ కోట ఉంది. 1958 నుంచి ఇది చైనా అధీనంలో ఉంది. అంతకుముందు భారత్-చైనా మధ్య సరిహద్దు ఖుర్నాక్ కోట వద్ద ఉండేది. ఆ తర్వాత చైనా దానిని ఆక్రమించుకుంది. ఉపగ్రహ చిత్రాల్లో ఖుర్నాక్ కోటలో రెండు హెలిప్యాడ్‌లు కనిపిస్తున్నాయి. 1962 యుద్ధంలో లడఖ్‌లో కార్యకలాపాల కోసం చైనా ఈ ఖుర్నాక్ కోటను ప్రధాన కార్యాలయంగా ఉపయోగించుకుంది. మరో ఉపగ్రహ చిత్రం ఫిరంగి సైట్‌ను చూపుతోంది. అంతేకాదు, చైనీయులు ఉత్తర నుంచి దక్షిణ వరకు పరస్పర అనుసంధానించిన కందకాలను కూడా చైనా నిర్మించింది. మరో చిత్రంలో ఓపెన్ డిఫెన్సివ్ పొజిషన్ కనిపిస్తోంది. ఇది ఉపరితం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి లాంచర్. ఎరెక్టర్, ట్రాన్స్‌పోర్టర్ అవకాశం ఉన్న ప్రదేశం. అంతేకాదు, సైనికులను, సామగ్రిని రవాణా చేసేందుకు సరస్సు ఒడ్డున సమాంతరంగా ఓ రహదారి కూడా కనిపిస్తోంది. తాజా బ్రిడ్జి నిర్మాణం వల్ల సరస్సు ఒడ్డుకు చేరుకునే దూరం 50-100 కిలోమీటర్లు తగ్గుతుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :