Sunday, 08 March 2026 04:26:30 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Ukraine: ఉక్రెయిన్‌పై ర‌ష్యా క్షిపణి దాడి.. 51 మంది మృతి!

Date : 04 September 2024 02:38 PM Views : 390

Studio18 News - అంతర్జాతీయం / : ర‌ష్యా మ‌రోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుప‌డింది. తాజాగా ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్ప‌డింది. ఈ దాడిలో సుమారు 51 మంది మృతిచెంద‌గా, మ‌రో 200 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ సీఎన్ఎన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ దాడిపై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. పోల్టావాలో ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకుని రష్యన్ ద‌ళాలు ఈ దాడికి పాల్ప‌డిన‌ట్టు తనకు సమాచారం అందిందని అన్నారు. ఇక ఈ దాడి కార‌ణంగా టెలికమ్యూనికేషన్స్ ఇనిస్టిట్యూట్ భవనాలలో ఒకటి పాక్షికంగా ధ్వంసం అయిన‌ట్లు ప్రెసిడెంట్ పేర్కొన్నారు. "పోల్టావాలో రష్యా దాడిపై నాకు ప్రాథమిక నివేదికలు అందాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెండు బాలిస్టిక్ క్షిపణులు ఆ ప్రాంతాన్ని తాకాయి" అని జెలెన్‌స్కీ అన్నారు. అలాగే మృతుల‌కు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేశారు. అటు పోల్టావా రీజియన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్‌ ఫిలిప్ ప్రోనిన్ టెలిగ్రామ్ ద్వారా తాజాగా మృతుల‌ సంఖ్యను వెల్ల‌డించారు. రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లిలో శిథిలాలను తొల‌గిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. శిథిలాల కింద మరో 18 మంది వరకు ఉండవచ్చని ప్రోనిన్ తెలిపారు. కాగా, సైనిక విద్యా సంస్థలో కనీసం 10 నివాస భవనాలు దెబ్బతిన్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ విచారణకు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా రష్యా దాడి త‌ర్వాత త‌మ‌కు సహాయం చేస్తున్న వారికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపారు. "ఏం జరిగిందో అన్ని పరిస్థితులపై పూర్తి, సత్వర విచారణకు ఆదేశించాను. అన్ని ఎమ‌ర్జెన్సీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. దాడి తర్వాత సహాయం చేస్తూ, ప్రాణాలను కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత‌లు తెలుపుతున్నాను" అని జెలెన్‌స్కీ అన్నారు. ఈ సంద‌ర్భంగా తమకు మ‌రిన్ని ఫైట‌ర్ జెట్స్‌ను అందించాల్సిందిగా పాశ్చాత్య మిత్ర‌దేశాల‌ను జెలెన్‌స్కీ కోరారు. అప్పుడే ర‌ష్యాను దీటుగా ఎదుర్కోగ‌ల‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :