Wednesday, 10 December 2025 02:42:38 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Mohammed bin Salman: తనను చంపేస్తారన్న భయంతో వణికిపోతున్న సౌదీ రాజు!

Date : 16 August 2024 01:28 PM Views : 190

Studio18 News - అంతర్జాతీయం / : తన వ్యక్తిగత భద్రతపై సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేస్తారేమోనని వణికిపోతున్నారు. యువరాజు ఆందోళన నేపథ్యంలో సౌదీ అరేబియా రాజకీయ స్థిరత్వంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా చట్ట సభ్యులతో చర్చల సందర్భంగా తన హత్యపై ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్టు అమెరికన్ వెబ్‌సైట్ ‘పొలిటికో’ పేర్కొంది. పొలిటికో కథనం ప్రకారం.. ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదికి తెస్తుందని అమెరికా చట్టసభ్యుల వద్ద మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళ వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను సాధారణీకరించే ఒప్పందం చేసుకోవడం ద్వారా తన ప్రాణాలను పణంగా పెట్టినట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం చేసుకుని హత్యకు గురైన ఈజిప్టు నేత అన్వర్ సాదత్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, సాదత్‌ను రక్షించేందుకు అమెరికా తీసుకున్న చర్యల గురించి ఆయన ఆరా తీసినట్టు తెలిసింది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేయడంలో ఆయన ఎదుర్కొనే బెదిరింపులు, గాజాలో జరుగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్న అరబ్ దేశాల్లో తనపై ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించినట్టు తెలిసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :