Thursday, 05 December 2024 09:40:28 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Tatyana Ozolina : రష్యన్ మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ టాట్యానా ఓజోలినా మృతి.. ఆమె ఇన్‌స్టా ఫాలోవర్స్ సంఖ్య ఎంతో తెలుసా..

Date : 25 July 2024 01:03 PM Views : 143

Studio18 News - అంతర్జాతీయం / : Russia’s Most Beautiful Biker : రష్యన్ మోస్ట్ బ్యూటీఫుల్ బైకర్ గా పేరుగడించిన టాట్యానా ఓజోలినా మృతి చెందింది. టర్కీలో జరిగిన ప్రమాదంలో ఆమె మరణించింది. ఆమె వయస్సు 38ఏళ్లు. టర్కీలోని మిలాస్ ప్రాంతంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న సమయంలో టాట్యానా నియంత్రణ కోల్పోయింది. దీంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె వెనుక కూర్చున్న టర్కీకి చెందిన బైకర్ తీవ్రంగా గాయపడింది. ఓజోలినా బైక్ నడుపుతుండగా మరో రైడింగ్ గ్రూప్ ఒక్కసారిగా అడ్డొచ్చింది. ఈక్రమంలో ఆమె ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే, స్థానిక పోలీసులు బైక్ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సోషల్ మీడియాలో టాట్యానా ఓజోలినా పాపులర్ అయ్యారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. ఆమె ఖాతాకు ఇన్ స్టాలో 10లక్షల మంది, యూట్యూబ్ లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఓజోలినా ప్రపంచ వ్యాప్తంగా సాహసోపేతమైన బైక్ రైడింగ్ లు చేస్తుంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తుంటుంది. ఆమె అందంగా ఉండటంతో రష్యా మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ గా అభిమానులు పేర్కొంటుంటారు. ఆమెకు 13ఏళ్ల కుమారుడు ఉన్నాడు.ఓజోలినా చివరిసారిగా సోషల్ మీడియా వీడియోలో రష్యాతో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా యూరోపియన్ యూనియన్ ప్రవేశం నిరాకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టాట్యానా ఓజోలినా అందానికి, బైక్ రైడింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. మోటార్ సైకిళ్లపై అభిరుచితో ఆమె నిరంతరం వార్తల్లో వ్యక్తిగా మారారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :