Monday, 16 September 2024 05:36:05 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే భారత్‌కు కష్టకాలమేనా.. ట్రంప్ విధానాలు మనకు ఇబ్బందిగా మారనున్నాయా?

Date : 12 August 2024 03:19 PM Views : 24

Studio18 News - అంతర్జాతీయం / : Donald Trump: అగ్రరాజ్యం ఎన్నికలు భారత్‌లో ఆసక్తి రేపుతున్నాయి. ట్రంప్ గెలిస్తే మనకు లాభమా.. నష్టమా అన్న చర్చ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్‌, నరేంద్రమోదీ మధ్య మంచి స్నేహబంధాలు ఉన్నాయి. అమెరికాలోని మోదీ అభిమానులు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. కానీ భారత్ విషయంలో ట్రంప్ వైఖరే మారుతూ వస్తోంది. నేషన్ ఫస్ట్ అనే రూల్ ఫాలో అయ్యే ట్రంప్ ప్రతీది అమెరికాకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే గతంలో అతను ఫాలో అయిన విధానాలు, ఇప్పుడు ప్రకటిస్తున్న విధానాలు ఏవీ మనకు అనుకూలంగా లేవు. ట్రంప్ కంటే కమలా హారిస్ గెలిస్తేనే భారత్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. ఆమె భారత మూలాలన్న వ్యక్తి కావడంతో పాటు.. హారిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రాటిక్ పార్టీ విధానాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో..అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10 శాతం సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్‌ నుంచి ఎగుమతులను కట్టడి చేసి, అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే అమెరికాకు 120 బిలియన్ డాలర్ల విలువైన వస్తు-సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్-యూఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది. మళ్లీ అధికారంలోకి వస్తే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు ట్రంప్. హార్లే-డేవిడ్‌సన్‌ లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్‌ పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధిస్తుందని ప్రచార సభల్లో వివరిస్తూ వస్తున్నారు. భారత్‌లో వందశాతం, నూటయాభై శాతం, రెండువందల శాతం పన్నులు ఉన్నాయని.. అలా అయితే అమెరికా కంపెనీలు భారత్‌తో ఎలా వ్యాపారం చేయగలవంటూ ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్‌ 2వందల శాతం పన్నులు వసూలు చేస్తుంటే..అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దిగుమతి సుంకం పెంచడమే కాదు.. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయులకు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి వలస వెళ్లే ఇండియన్ అమెరికన్స్‌పై ఆంక్షలు మరింత కఠినతరం కావచ్చు. ఇమిగ్రేషన్ రూల్స్ మార్చడంతో పాటు H1B వీసా గైడ్‌లైన్స్ చేంజ్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే మాస్టర్స్ చేసేందుకు ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లిన..భవిష్యత్‌లో యూఎస్‌కు వెళ్లబోతున్న ఇండియన్స్‌కు ఇబ్బందులు తప్పవంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ట్రంప్ గెలిస్తే మన ఆర్థిక విధానాలను సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. అయితే 2019లో ట్రంప్ ఈ జాబితా నుంచి భారత్‌ను తొలగించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వస్తే ఇక అంతర్జాతీయ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఆసియాలోని అమెరికా మిత్రదేశాలకు ట్రంప్ సహకరించే అవకాశం లేదు. సేమ్‌టైమ్ భారత్-రష్యా సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ అధ్యక్షుడైతే వచ్చే నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఉగ్రవాదంపై పోరులో ట్రంప్ భారత్‌తో కలసి వచ్చే అవకాశం ఉంది. ట్రంప్‌ చైనాకు బద్ధ వ్యతిరేకి. చైనా, పాక్ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. ట్రంప్‌ గతంలో అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్‌కే జరిగింది. చైనాతో ట్రంప్‌ తెగదెంపులు చేసుకోవడం వల్లే పుల్వామా, గల్వాన్ ఘటనల్లో యూఎస్ భారత్‌కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్‌ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేమ్‌. భారత్‌, అమెరికా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్‌ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చన్నది అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు, అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతుండటం..భారత్‌పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :