Thursday, 05 December 2024 09:45:04 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

suicide drone: నియంత చేతిలో మరో ప్రమాదకర ఆయుధం... సూసైడ్ డ్రోన్

Date : 26 August 2024 03:36 PM Views : 48

Studio18 News - అంతర్జాతీయం / : ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంతగా పేరొందిన కిమ్ జోంగ్ ఉన్ చేతికి ‘సూసైడ్ డ్రోన్’ రూపంలో మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది. తాజాగా ఈ డ్రోన్ పనితీరును కిమ్ స్వయంగా పరీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలతో ఉత్తర కొరియా అధికారిక మీడియా ఓ వీడియోను విడుదల చేసింది. ఈ పరీక్షలో భాగంగా పంట పొలాల మధ్య ఉంచిన యుద్ధ ట్యాంకును సూసైడ్ డ్రోన్ ద్వంసం చేయడం ఫొటోలలో కనిపిస్తోంది. పూర్తిగా తెలుపు రంగులో ఉన్న ఓ డ్రోన్ గాల్లోకి లేవడం, వేగంగా దూసుకెళ్లి యుద్ధ ట్యాంకును ఢీ కొట్టడం, ఆపై భారీ పేలుడు చోటుచేసుకోవడం.. తదితర ఘటనలకు సంబంధించిన ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. మిగతా డ్రోన్లు లక్ష్యానికి నిర్దేశిత దూరంలో ఆగి క్షిపణి దాడి చేసి తిరిగొస్తాయి. అయితే, ఈ డ్రోన్ మాత్రం నేరుగా వెళ్లి లక్ష్యాన్ని ఢీ కొట్టి పేలిపోతుంది. తద్వారా అక్కడ భారీ విధ్వంసం జరుగుతుంది. భూ ఉపరితలంతో పాటు సముద్ర ఉపరితలంలోని లక్ష్యాలను కూడా ఈ డ్రోన్లతో ఛేదించవచ్చని కిమ్ చెప్పారు. అంతర్జాతీయ సైనిక సామర్థ్యాలు, ఆత్మరక్షణ వ్యవస్థలను పరీశీలిస్తే డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతికత ఎంత అవసరమో తెలుస్తోందన్నారు. తాజా సూసైడ్ డ్రోన్లను పెద్ద ఎత్తున తయారుచేసి సైన్యానికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :