Studio18 News - అంతర్జాతీయం / : Thailand Transgender Woman : థాయ్‌లాండ్‌కు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ జపనీస్ పై ప్రతీకారం తీర్చుకుంది. తనకు జరిగిన నమ్మకద్రోహానికి ప్రతిగా 2011 నుంచి 2024 మధ్యాకాలంలో 73 మంది జపనీస్ పురుషులు ఒకరి తరువాత ఒకరిని ప్రేమవలలోకి దింపి మోసం చేసింది. వారి వద్ద నుంచి రూ. 7.35కోట్లు దోచుకుంది. ఆ ట్రాన్స్ ఉమెన్ ఎందుకలా చేసింది..? అసలు కారణం ఏమిటనే విషయాలు తెలుసుకుందాం.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. థాయ్ లాండ్ ను సందర్శించిన అమీ అనే జపాన్ వ్యక్తి ట్రాన్స్‌జెండర్ మహిళ తనను 15మిలియన్ థాయ్ బాట్ మోసం చేసిందని థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. ఆగస్టు 4న బ్యాంకాక్ లో ట్రాన్స్ జెండర్ మహిళ ఉథాయ్ నంతఖాన్ ను అరెస్టు చేశారు. ఆమె థాయ్‌లాండ్‌లో పర్యటకురాలిగా నటించి.. పురుషుల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంది. ఆ తరువాత వారిని ప్రేమ వలలోకి దింపి మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని పోలీసులు వెల్లడించారు. జపాన్ పురుషులపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇదంతా చేశానని ట్రాన్స్ ఉమెన్ పోలీసుల వివచారణలో పేర్కొంది. కొన్నేళ్లు క్రితం జపాన్ కు చెందిన తన బాయ్ ఫ్రెండ్ తనను మోసంచేసి వెళ్లిపోయాడని, ఆ బాధను భరించలేక నేను జపనీస్ పురుషులను మోసం చేయాలని నిర్ణయించుకున్నానని ఉథాయ్ నంతఖాన్ పోలీసుల విచారణలో తెలిపింది. నేను కాలేజీలో ఉన్నప్పుడు నా జపనీస్ బాయ్ ఫ్రెండ్ నన్ను ట్రిప్ కు తీసుకెళ్లాడు. బిల్లులన్నీ చెల్లించే క్రమంలో నన్ను మోసంచేసి వెళ్లిపోయాడు. దీంతో తనకు జపనీస్ పై ద్వేషం పెరిగింది. నేను మోసపోయిన సొమ్మును జపనీస్ నుంచే రాబట్టుకోవాలని భావించాను. అందుకే జపనీస్ పురుషులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నానని, వారిని మోసం చేసి డబ్బులు దోచుకుంటున్నానని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు ఒకరి తరువాత ఒకరు మొత్తం 73 మంది జపనీస్ ను మోసం చేసి రూ.7.35 కోట్లను ట్రాన్స్‌జెండర్ మహిళ దోచుకుంది.
Admin
Studio18 News