Saturday, 07 March 2026 08:19:26 PM
# పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం # పదవ తరగతి విద్యార్థులు ఒత్తిడిని వీడి పరీక్షలకు సిద్ధం కావాలి: కలెక్టర్ రాజర్షి షా # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు

Tim Walz: డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక

Date : 07 August 2024 11:57 AM Views : 1935

Studio18 News - అంతర్జాతీయం / : వచ్చే నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సంరంభం ఊపందుకుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్ధిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఎంపిక అయ్యారు. అధ్యక్ష రేసులో ఉన్న కమలా హారిస్ తాజాగా వాల్ట్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వెస్ట్ పాయింట్ కు చెందిన చిన్న పట్టణం నెబ్రస్కాలో పెరిగిన వాల్జ్ సామాజిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా, ఫుట్ బాల్ కోచ్ గా పని చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు వరకూ మిన్నెసొటాలోని మంకాటో వెస్ట్ హైస్కూల్ యూనియన్ మెంబర్ గా వ్యవహరించారు. మిన్నెసొటా జిల్లా నుంచి 2006లో తొలిసారి కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. అమెరికా చట్ట సభలో 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వాల్జ్ .. 2018 లో మిన్నెసొటా గవర్నర్ గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీని ఎండగట్టడంలో తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించిన వాల్జ్ .. ఆర్మీ నేషనల్ గార్డ్ లో 24 ఏళ్లు పని చేశారు. ఆయన ఎంపిక ద్వారా దేశ పశ్చిమ మధయ్ ప్రాంతంలో డెమోక్రటిక్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. కాగా, డెమోక్రటిక్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్ధిగా కమలా హారిస్ లాంఛనంగా ఖరారు అయ్యారు. హారిస్ నామినేషన్ సోమవారం రాత్రి అధికారికమైంది. ఆమెకు అనుకూలంగా 99 శాతం మంది పార్టీ ప్రతినిధుల ఓట్లు లభించాయి. దేశ వ్యాప్తంగా సుమారు 4,567 మంది హారిస్ ను బలపరుస్తూ ఓటు వేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :