Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుల్ రూఫ్ తాలూక్దర్ తన పదవికి రాజీనామా చేసినట్లు బ్లూమ్‌బర్గ్ శనివారం వెల్లడించింది. ఆ దేశంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల పెద్ద ఎత్తున నిరసనకారులు సెంట్రల్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటన జరిగిన కొన్నిరోజులకే ఆయన రాజీనామా చేశారు. శుక్రవారమే తన పదవికి రాజీనామా చేసిన అబ్దుల్ రూఫ్... వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Admin
Studio18 News