Studio18 News - అంతర్జాతీయం / : Rado Watch : ఆయనో భారతీయ బిలియనీర్.. సాధారణంగా ఎవరి నుంచి గిఫ్ట్‌లు తీసుకోరు. కానీ, తన అభిమాని ఇచ్చిన గిఫ్ట్ తీసుకున్నారు. ఇప్పుడు.. ఆ అభిమానికి కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు బిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. లులు గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ.. అభిమాని కోసం ఏకంగా ఖరీదైన రాడో వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబర్ ఎఫిన్ ఎం సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేశారు. ఎఫిన్ ఎమ్ లులు గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవలే సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఛైర్మన్ ఎంఎ యూసఫ్ అలీ సాదరంగా స్వాగతం పలికారు. ఇరువురు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలీ ఎఫిన్‌కి లక్షల ఖరీదైన రాడో వాచ్‌ని బహకరించారు. రాడో వెబ్‌సైట్ ప్రకారం.. ఈ వాచ్ ధర రూ. 2 లక్షల వరకు ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసిన యూట్యూబర్ ”యూసఫ్ అలీ సర్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ ” అంటూ పోస్టు చేశారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ”అఫ్ యు డిజర్వ్ బ్రో” అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ”లైఫ్ సర్కిల్ మూమెంట్. కంగ్రాట్స్ బ్రో.” అంటూ మరొకరు కామెంట్ చేశారు. గత జూలై 2024లో ఎఫిన్ ఎమ్.. బిలియనీర్ యూసుఫ్ అలీని మరుపురాని బహుమతితో ఆశ్చర్యపరిచారు. బిలియనీర్ దివంగత తల్లి ఫొటోను కలిగిన వాచ్ బహుమతిగా అందించారు. అలీ తన తల్లి గురించి ఆప్యాయంగా మాట్లాడిన వీడియో తనను కదలించిందని ఎఫిన్ వివరించాడు. దానికి అలీ “తల్లిని ఎవరు ప్రేమించరు?” అని వినయంగా సమాధానమిచ్చారు. “ఈ వాచ్ తమ తల్లిని అమితంగా ప్రేమించే వారి కోసం అంటూ పేర్కొన్నారు. ఈ వాచ్ వాటర్ ప్రూఫ్.. ఎప్పటికి చెక్కుచెదరదంటూ ఎఫిన్ తెలిపాడు. యూసఫ్ అలీ లులు గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ప్రపంచవ్యాప్తంగా లులూ హైపర్‌మార్కెట్ చైన్, లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌ను కలిగి ఉంది. గల్ఫ్, భారత్ అంతటా 256 హైపర్ మార్కెట్లు, మాల్స్ రిటైల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం.. ఆయన నికర విలువ 8.9 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2001లో దుబాయ్ నుంచి అబుదాబికి ప్రయాణిస్తున్నప్పుడు కారు ప్రమాదంలో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయినట్లు గల్ఫ్ న్యూస్ నివేదించింది.
Admin
Studio18 News