Studio18 News - అంతర్జాతీయం / : యూకేలోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ పదవికి పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోటీ పడుతున్నారు. వివిధ కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైల్లో ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా ఉన్న లార్డ్ ప్యాటెన్ రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఆ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ పడుతున్నట్లు ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుకారీ వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ నుంచి స్పష్టత వచ్చాక స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ రేసులో ఇమ్రాన్ ఖాన్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క, ఈ ఛాన్స్‌లర్ పదవి కోసం యూకే మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ కూడా పోటీ పడుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నప్పటికీ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ 1972లో ఆక్స్‌ఫర్డ్‌లో ఎకనమిక్స్, పాలిటిక్స్ విద్యను అభ్యసించారు. 2005 నుంచి 2014 వరకు బ్రాడ్ ఫోర్డ్ యూనివర్సిటీకి ఛాన్స్‌లర్‌గా పని చేశారు.
Admin
Studio18 News