Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారిన నేపథ్యంలో, ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేశారు. ఆమె ఇప్పటికే ఢాకా నుంచి బయల్దేరి భారత్ చేరుకున్నారని, త్రిపురలోని అగర్తల సిటీలో ఆమె హెలికాప్టర్ ల్యాండైందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు, బంగ్లాదేశ్ లో పాలనను సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. దీనిపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ సందేశం వెలువరించారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత బంగ్లాదేశ్ లో సైనిక పాలన విధించినట్టు ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బంగ్లాదేశ్ లో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని, ఇవాళ రాత్రి లోగా పరిస్థితులను అదుపులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. హింసను ఆపాలని ఆయన బంగ్లాదేశ్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. దేశంలో త్వరలోనే శాంతిని నెలకొల్పుతామని పేర్కొన్నారు.
Admin
Studio18 News