Studio18 News - అంతర్జాతీయం / : Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి భారత సంతతి అమెరికన్ కమలా హారిస్‌కు భారీగా మద్దుతు లభిస్తోంది. యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మద్దతుదారులు గురువారం రాత్రి జూమ్ వేదికగా హాజరై రికార్డులు బద్దలు కొట్టారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కోసం 90 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో 2 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 16.48 కోట్లను)కు పైగా నిధులను సేకరించారు. అయితే, జూమ్ కాల్ సమయంలో అవాంతరాలు ఉన్నప్పటికీ.. అతిపెద్ద జూమ్ మీటింగ్‌లో లక్షా 64వేల మంది మద్దతుదారులు పాల్గొన్నారు. “వైట్ ఉమెన్.. ఆన్సర్ ది కాల్” అనే పేరుతో ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహించారు. కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద జూమ్ కాల్ : ఈ కార్యక్రమంలో బ్రిటన్ వంటి ప్రముఖ అమెరికన్ సెలబ్రిటీలు భారీ ఎత్తునా హాజరయ్యారు. జూమ్ రికార్డ్-బ్రేకింగ్ కాల్ రికార్డును బద్దలు కొట్టింది. కంపెనీ చరిత్రలో ఇది అతిపెద్ద జూమ్ కాల్ అని చెప్పవచ్చు. జూమ్ కాల్ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా కొంతమంది మద్దతుదారులు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్‌కు మారారు.
Admin
Studio18 News