Thursday, 05 December 2024 10:09:07 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Brazil flight Crash: ఆ పొరపాటే కాపాడింది.. కూలిపోయిన బ్రెజిల్ విమానాన్ని మిస్ అయిన ప్రయాణికుడు

Date : 10 August 2024 03:54 PM Views : 32

Studio18 News - అంతర్జాతీయం / : విమాన టికెట్ బుకింగ్ విషయంలో ఏర్పడిన కన్ఫ్యూజన్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. చివరి క్షణంలో పొరపాటు గుర్తించి విమానం ఎక్కేందుకు వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వారితో గొడవ పెట్టుకుని నానా తిట్లు తిట్టిన వ్యక్తే కాసేపటి తర్వాత తన ప్రాణం కాపాడిన దేవుడివంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. బ్రెజిల్ లో జరిగిన ఈ ఘటన వివరాలు.. శుక్రవారం రాత్రి బ్రెజిల్ లో ఓ విమానం కూలిపోయి అందులోని మొత్తం 62 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఓ ప్రయాణికుడు చిన్న పొరపాటు కారణంగా ఆ విమానం ఎక్కలేకపోయాడు. రియో డి జెనీరో ప్రాంతానికి చెందిన అడ్రియానో అసిస్ శుక్రవారం కాస్కావెల్ నుంచి గ్వారుల్‌హోస్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. టైముకు ఎయిర్ పోర్టుకు కూడా చేరుకున్నాడు. అయితే, తాను బుక్ చేసుకున్న టికెట్ ‘లాటమ్ ఎయిర్ లైన్స్’ కంపెనీదని భావించి ఆ ఫ్లైట్ కోసం లాంజ్ లో వేచి ఉన్నాడు. కాసేపటి తర్వాత టికెట్ చూసుకోగా అది ‘వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌’ టికెట్.. అటుచూస్తే వోపాస్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అసిస్ హడావుడిగా బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకున్నాడు. కానీ అప్పటికే బోర్డింగ్ క్లోజ్ చేశామంటూ అక్కడున్న సిబ్బంది అసిస్ ను విమానంలోకి ఎక్కనివ్వలేదు. దీనిపై అసిస్ వారితో తీవ్రంగా గొడవ పెట్టుకున్నాడు. తర్వాత వోపాస్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానాశ్రయం మొత్తం వెతికి తనను అడ్డుకున్న ఉద్యోగిని కలిశానని, అతడిని కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పానని అసిస్ వివరించాడు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :