Thursday, 05 December 2024 09:32:14 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Bangladesh protests: బంగ్లాదేశ్‌లో భ‌యంక‌ర ప‌రిస్థితులు... జాతిపిత విగ్ర‌హాన్ని కూడా వ‌ద‌ల‌ని నిర‌స‌న‌కారులు!

Date : 05 August 2024 05:27 PM Views : 38

Studio18 News - అంతర్జాతీయం / : బంగ్లాదేశ్‌లో ప‌రిస్థితులు అంత‌కంత‌కు దిగ‌జారుతున్నాయి. బంగ్లా రాజ‌ధాని ఢాకాలో ఆందోళ‌న‌కారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆ దేశ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచివెళ్లినట్లు వార్తలు రావడంతో వేలాది మంది బంగ్లాదేశ్ నిరసనకారులు కర్ఫ్యూను ధిక్కరించి రాజధాని ఢాకాలోని ప్రధాని ప్యాలెస్‌ను ముట్టడించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ దేశ జాతిపిత‌, హసీనా తండ్రి, బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూడా వారు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఢాకాలో ఎక్కడిక్కడ సైనికులు, పోలీసులు సాయుధ వాహనాలు, ముళ్ల కంచెలు, బారికేడ్లు ఉన్నప్పటికీ... ఆందోళనకారులు అన్నింటినీ దాటుకుని వ‌చ్చి హసీనా కార్యాలయాన్ని ముట్ట‌డించిన‌ట్లు అక్క‌డి మీడియా పేర్కొంది. సుమారు 4 ల‌క్ష‌ల‌ మంది నిరసనకారులు వీధుల్లో ఉన్నారని స్థానిక మీడియా అంచనా. సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోటాలకు వ్యతిరేకంగా గత నెలలో ప్రారంభమైన నిర‌స‌న‌ ర్యాలీలు ప్రధాని హసీనా 15 ఏళ్ల పాలనకు ముగింపు ప‌లికే వ‌ర‌కు వెళ్లింది. అంతేగాక దేశంలో తీవ్ర‌ అశాంతికి దారితీశాయి. నిర‌స‌న‌కారుల ఆందోళ‌న నేప‌థ్యంలో నిన్న జ‌రిగిన హింస‌లో 14 మంది పోలీసు అధికారులతో సహా 98 మంది మృతిచెందారు. జులైలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి హింసాకాండలో ఇప్ప‌టివ‌ర‌కూ మరణించిన వారి సంఖ్య 300కి చేరింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :