Thursday, 14 November 2024 06:26:10 AM
# #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు.. # కార్ల కంటైనర్‌లో మంటలు, 8 కార్లు దగ్ధం.. # బాలికపై దారుణం.. పవన్ కల్యాణ్‌ ట్వీట్‌.. స్పందించిన హోంమంత్రి అనిత # లక్నో బయల్దేరిన రామ్ చరణ్

DDOS Attack: ట్రంప్ ఇంటర్వ్యూపై డీడీఓఎస్ అటాక్.. ఏంటీ దాడి?

Date : 13 August 2024 01:48 PM Views : 266

Studio18 News - అంతర్జాతీయం / : డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ అరుదైన ఇంటర్వ్యూకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. తొలుత దాదాపుగా 80 లక్షల మంది ఇంటర్వ్యూను విన్నారు. తర్వాత ఈ సంఖ్య 2.7 కోట్ల మందికి చేరింది. అయితే, ఇంటర్వ్యూ ప్రారంభమయ్యే సమయానికి సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఇంటర్వ్యూ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా ఆడియో సరిగా వినిపించలేదని పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. తొలుత సాంకేతిక సమస్యగా భావించినప్పటికీ తర్వాత డీడీఓఎస్‌ అటాక్‌ జరిగిందని మస్క్‌ తెలిపారు. కాగా, ఈ ఇంటర్వ్యూపై ట్రంప్ స్పందిస్తూ.. అన్ని రికార్డులు బద్దలు కొట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇది శతాబ్దపు ఇంటర్వ్యూ అని వ్యాఖ్యానించారు. ఏంటీ డీడీఎస్ అటాక్..? డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీసెస్ (డీడీఓఎస్) అటాక్ లక్ష్యం ఓ వెబ్ సైట్ లేదా సర్వర్ కు తాత్కాలికంగా వీక్షకులను దూరం చేయడం. టార్గెట్ చేసిన సర్వర్ కు డీడీఓఎస్ నుంచి ట్రాఫిక్ పోటెత్తుతుంది. దాంతో వెబ్ సైట్ పనితీరు మందగిస్తుంది. కొన్ని సందర్బాలలో వెబ్ సైట్ ఆఫ్ లైన్ లోకి మారుతుంది. దీంతో నిజమైన వ్యూయర్లు లాగిన్ కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ అటాక్ కొన్ని గంటలు లేదా కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్, మస్క్ ఇంటర్వ్యూను ఎక్కువ మంది యూజర్లు వినకుండా అడ్డుకోవడానికి ఈ దాడి జరిగిందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :