Thursday, 05 December 2024 09:24:31 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Israel: ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లా దాడులు ఈ రోజు నుంచే మొదలు!

Date : 05 August 2024 12:08 PM Views : 46

Studio18 News - అంతర్జాతీయం / : తూర్పు ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్, హిజ్బుల్లా ఇవాళ్టి (సోమవారం) నుంచే దాడి మొదలు పెట్టే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. ఈ మేరకు జీ7 దేశాల విదేశాంగ మంత్రులను ఆయన అప్రమత్తం చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా తమ భూభాగంపై దాడులను తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం సమాయత్తమవుతోందని, ఇరాన్‌పై ముందస్తు దాడికి అనుమతి ఇవ్వొచ్చని ఇజ్రాయెల్‌ ప్రముఖ దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ పేర్కొంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మొస్సాద్, షిన్ బెట్‌ల చీఫ్‌లు డేవిడ్ బర్నియా, రోనెన్ బార్‌లతో నెతన్యాహు సమావేశమయ్యారని పేర్కొంది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి యోవ్ గల్లంట్, ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్జి హలేవి కూడా పాల్గొన్నారని వివరించింది. కాగా శనివారం ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హిజ్జుల్లా కేవలం సైనిక లక్ష్యాలకే పరిమితం కాబోదని, ఇజ్రాయెల్‌లోని ఇతర ప్రాంతాలపై కూడా గురిపెడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులు ఇవే.. ఇదిలావుంచితే.. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో హమాస్ నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతీకార చర్యగా హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. నాటి నుంచి, దాదాపు 10 నెలలుగా సరిహద్దులో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితులకు ఆజ్యం పోస్తూ ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాల్ మైదానంపై హిజ్బుల్లా రాకెట్ దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది చిన్నారులు మృతి చెందారు. ప్రతీకారంగా ఈ దాడికి వ్యూహ రచన చేసిన హిజ్బుల్లా కమాండర్‌ ఫువాద్ షుక్ర్ ను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ పరిణామంతో హిజ్బుల్లా మరింత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్‌కు హిజ్బుల్లా మద్దతు ప్రకటించింది. ఈ రెండు కలిసి ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :