Monday, 17 February 2025 03:19:50 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Joe Biden: జో బైడెన్ మానసిక ఆరోగ్యం గురించి వైట్ హౌస్ డాక్టర్ ఏమన్నారంటే...!

Date : 26 July 2024 12:06 PM Views : 177

Studio18 News - అంతర్జాతీయం / : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఒకరి పేరుకు బదులు మరొకరి పేరు పలకడం, ఎగ్జిట్ ఒకవైపు ఉంటే మరోవైపు వెళ్లడం, భార్య అనుకుని మరో మహిళను ముద్దాడబోవడం... ఇలాంటివి చాలా ఘటనలు బైడెన్ ఆరోగ్యంపై విమర్శలకు దారితీశాయి. వయసు 81 సంవత్సరాలు కాబట్టి మతిమరపు, అయోమయం సహజమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నా, అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి అది చాలా ప్రమాదకరం అని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డాక్టర్ ఒకరు ఆసక్తికర అంశం వెల్లడించారు. డాక్టర్ కెవిన్ ఓ కానర్ దీనిపై న్యూయార్క్ పోస్ట్ పత్రికతో మాట్లాడారు. బైడెన్ మెదడుకు వచ్చిన ఢోకా ఏమీలేదని, ఆయన మానసిక ఆరోగ్యం దివ్యంగా ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. చాలామంది అంటున్నట్టుగా ఆయనకు పార్కిన్సన్ వ్యాధికి సంబంధించిన ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. పదవీకాలం ముగిసేనాటికి ఆయన ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చని డాక్టర్ కెవిన్ ఓ కానర్ తెలిపారు. బైడెన్ ఇటీవలే అమెరికా అధ్యక్ష రేసు నుంచి అనూహ్య రీతిలో వైదొలగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :