Thursday, 05 December 2024 08:19:18 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Sheikh Hasina: షేక్ హసీనాకు బంగ్లా ప్రభుత్వం మరో ఝ‌ల‌క్‌!

Date : 22 August 2024 03:12 PM Views : 74

Studio18 News - అంతర్జాతీయం / : మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆమె దౌత్య పాస్‌పోర్ట్‌ను బంగ్లా ప్రభుత్వం రద్దు చేసింది. హసీనాతో పాటు ఆమె పార్టీకి చెందిన మాజీ ఎంపీల దౌత్య పాస్‌పోర్ట్‌లను కూడా క్యాన్సిల్‌ చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, దౌత్య పాస్‌పోర్టు ఉన్న‌వారు కొన్ని నిర్దిష్ట దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వెసులుబాటును క‌లిగి ఉంటారు. ఇక బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా చెల‌రేగిన‌ నిర‌స‌నల కారణంగా హ‌సీనా త‌న‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఆమె ఏకంగా దేశాన్ని కూడా వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చింది. అలా ఈ నెల 5న బంగ్లాదేశ్‌ను వీడిన షేక్ హ‌సీనా ప్ర‌స్తుతం ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్ర‌మంలో షేక్‌ హసీనాను తమ దేశానికి అప్పగించాలని ఇప్పటికే బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భార‌త ప్ర‌భుత్వాన్ని కోరింది. బంగ్లాదేశ్‌ విజయాన్ని అడ్డుకునేందుకు భారత్ నుంచి ఆమె కుట్ర చేస్తున్నారని ఈ సంద‌ర్భంగా బీఎన్‌పీ ఆరోపించింది. కాగా, నిర‌స‌న‌ల్లో చెల‌రేగిన హింస కార‌ణంగా చ‌నిపోయిన వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హసీనాపై పదుల సంఖ్యలో హత్య కేసులు నమోదయ్యాయి. ప్ర‌స్తుతం ఆమె మొత్తంగా 44 కేసులను ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :