Thursday, 05 December 2024 09:41:22 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Germany: ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా

Date : 17 August 2024 12:00 PM Views : 81

Studio18 News - అంతర్జాతీయం / : జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లాలి అనుకునే వారికి ఇది మంచి శుభవార్త. జర్మనీ వర్క్ వీసా ప్రాసెస్ చేయడానికి ఇంతకు ముందు తొమ్మిది నెలల వరకూ సమయం పట్టేది. వర్క్ వీసీ ప్రాసెసింగ్ కు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల నైపుణ్యం కల్గిన కార్మికుల శిక్షణపై ప్రభావం చూపుతోంది. జర్మనీలో భారీ పెట్టుబడులు పెట్టే భారతీయ కంపెనీలు త్వరిత వీసాలపై ఆధారపడతాయి. ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయకపోతే జర్మనీ ఆర్ధిక వ్యవస్థ 74 బిలియన్ యూరోల నష్టాన్ని చవిచూస్తుందని జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం ఫెడరల్ విదేశాంగ కార్యాలయం ఈ ఏడాది జూన్ వరకూ 80వేల వర్క్ వీసాలను జారీ చేసింది. వీరిలో 50 శాతం మంది నైపుణ్యం కలిగిన కార్మికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ వెల్లడించారు. ఈ డిమాండ్ ను పరిష్కరించడానికి వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. దీంతో భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. వర్క్ వీసా ప్రాసెసింగ్ ను ఇప్పుడు కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు. కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రెండు రోజుల క్రితం జర్మన్ ఎంపీలు జుర్గెన్, రాల్ప్ బ్రింకాస్ లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. డిల్లీలో జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :