Thursday, 05 December 2024 09:49:59 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

PV Sindhu: పారిస్‌లో భారత బృందానికి పీవీ సింధు నాయకత్వం.. తొలిసారి నదిపై సంబరాలు

Date : 27 July 2024 11:48 AM Views : 55

Studio18 News - అంతర్జాతీయం / : ఫ్యాషన్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి నదిలో జరిగిన సంబరాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నదిపై ఆరు కిలోమీటర్ల మేర సాగిన పరేడ్‌లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అత్యధిక మంది పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాక్ సహా దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన వారు ఇందులో పాల్గొన్నారు. ఫ్రెంచ్ అక్షర క్రమంలో ఆయా దేశాలు పరేడ్‌లో పాల్గొనగా భారత్ 84వ దేశంగా పరేడ్‌లో పాల్గొంది. భారత బృందానికి హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, శరత్‌కుమార్ నేతృత్వం వహించారు. త్రివర్ణ పతాకం చేబూనగా, అథ్లెట్లు చేతుల్లో చిన్నిచిన్న మువ్వన్నెల పతాకాలు ధరించారు. తొలుత గ్రీస్ బృందం పరేడ్‌లో పాల్గొనగా, ఆ తర్వాత సౌతాఫ్రికా బృందం పాల్గొంది. 84 మందితో కూడిన భారత బృందం బోటులో సీన్ నదిపై కనిపించగానే అభిమానులు తమ మద్దతు తెలుపుతూ ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. భారత పరేడ్‌లో నీరజ్ చోప్రా వంటి స్టార్లు కనిపించకపోవడం లోటుగా అనిపించింది. కొందరు అథ్లెట్లు ఇంకా పారిస్ చేరుకోవాల్సి ఉంది. భారత హాకీ పురుషుల జట్టుతో పారిస్‌లో భారత్ పతకాల వేట ప్రారంభం కానుంది. అలాగే, స్టార్ షట్లర్ లక్ష్యసేన్, వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న యాక్షన్‌కు సిద్ధంగా ఉన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :