Studio18 News - అంతర్జాతీయం / : Indian Origin Man Shot Dead In US : అమెరికాలో మరో దారుణం జరిగింది. మరో భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ చిన్న వివాదం.. అతడి ప్రాణం తీసింది. అసలేం జరిగిందంటే.. అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో అతడు స్పాట్ లోనే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆగ్రాకు చెందిన గావిన్ దసౌర్ అమెరికాలో స్థిరపడ్డాడు. కారులో అతడు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో అతడి కారుని మరో కారు ఢీకొట్టింది. దీంతో దసౌర్ తుపాకీ తీసుకుని వెనుక వాహనంలో ఉన్న డ్రైవర్ త వాగ్వాదానికి దిగాడు. గన్ చూపిస్తూ తిట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ డ్రైవర్ తన తుపాకీలో దసౌర్ పై కాల్పులు జరిపాడు. అంతే, దసౌర్ స్పాట్ లోనే చనిపోయాడు. మృతుడు దసౌర్ వయసు 29ఏళ్లు. ఇటీవలే అతడికి పెళ్లైంది. జూన్ 29న జమారోను పెళ్లి చేసుకున్నాడు. తన భార్యతో కలిసి దసౌర్ కారులో బయటకు వెళ్లాడు. అదే సమయంలో చవర్లెట్ పికప్ ట్రక్ దసౌర్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో దసౌర్ కోపంతో ఊగిపోయాడు. చేతిలో గన్ పట్టుకుని కారు దిగి వచ్చాడు. పికప్ ట్రక్ డ్రైవర్ తో చాలా కోపంగా మాట్లాడాడు. గన్ చూపించి వార్నింగ్ ఇచ్చాడు. అంతే.. ఆ పక్క వ్యక్తి వెంటనే కాల్పులు జరిపాడు. అతి సమీపం నుంచి దసౌర్ ను కాల్చాడు. దాంతో దసౌర్ స్పాట్ లోనే చనిపోయాడు. దసౌర్ పెళ్లి జరిగి ఇంకా నెల రోజులు కూడా అవ్వలేదు. ఇంతలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దసౌర్ అకాల మరణంతో అతడి భార్య కన్నీరుమున్నీరు అయ్యింది. ఇద్దరమూ ఎంతగానో ప్రేమించుకున్నామని, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నామని, ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని విలపించింది. హనిమూన్ కు వెళ్లాలని, ప్రపంచం మొత్తం తిరిగొద్దామని ఎన్నో కలలు కన్నామని ఆమె వాపోయింది.
Admin
Studio18 News