Monday, 08 December 2025 04:05:19 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

షేక్ హసీనా భారత్‌లోకి అడుగుపెట్టే ముందు వాయుసేన ఫైటర్ జెట్లు ఏం చేశాయో తెలుసా!

Date : 06 August 2024 10:28 AM Views : 246

Studio18 News - అంతర్జాతీయం / : Bangladesh Government Crisis : కొన్నాళ్లుగా రిజర్వేషన్ల గొడవతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తరువాత ఆమె దేశం విడిచిపెట్టారు. ప్రస్తుతం షేక్ హసీనా భారత్ లో ఉన్నారు. ఆమె భారత్ నుంచి తన సోదరి నివసించే లండన్ (యునైటెడ్ కింగడమ్) కు వెళ్లొచ్చని వార్తలు వచ్చాయి. అయితే, బ్రిటీష్ మీడియా నివేదికల ప్రకారం.. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో ఆమె భారత్ లోనే ఉన్నారు. ఇదిలాఉండగా.. బంగ్లాదేశ్ లోని జమాతే ఇస్లామీ అనే సంస్థ పెద్ద ప్రకటన చేస్తూ.. షేక్ హసీనా ఎక్కడ బసచేసినా ప్రదర్శనలు నిర్వహించాలని పేర్కొంది. ప్రధాని పదవికి రాజీనామా అనంతరం బంగ్లాదేశ్ ను షేక్ హసీనా విడిచిపెట్టారు. ఆమె ఏజేఎక్స్ అనే సీ-130జే విమానంలో సోమవారం సాయంత్రం 5.30గంటల సమయంలో భారత్ సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అటు నుంచి ఓ విమానం వస్తున్నట్లు భారత భద్రతా బలగాలు గమనించాయి. అందులో ఎవరు ఉన్నారో ముందే పసిగట్టిన అధికారులు భారత్ లోకి అనుమతించాలని ఆదేశించారు. విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. హసీనా ప్రయాణిస్తున్న విమానాన్ని భారత ఫైటర్స్ జెట్లు అనుసరించాయి. బీహార్, ఝార్ఖండ్ మీదుగా ఆవి రక్షణ కల్పించాయి. ఆమె భారత్ లోకి అడుగుపెట్టే సమయంలో భారత వాయుసేన, సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందే సిద్ధపడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. షేక్ హసీనా విమానం సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో హిండన్ ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తరువాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెతో భేటీ అయ్యారు. ఇదిలాఉంటే.. హసీనా భారత్ దేశానికి చేరుకోవటంతోపాటు.. బంగ్లాదేశ్ లోని హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతాను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు. మరోవైపు ఢాకా నగరానికి ఎయిరిండియా విమానాలను రద్దు చేసింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :